రాష్ట్రీయం

రైతుల సమస్యలపై ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 2: విద్యార్థులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్వరలో మరో ఉద్యమం చేపట్టనున్నట్లు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో గురువారం జరిగిన జన ఆవేదన సభలో ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌తో పాటు రైతుల రుణమాఫీ, గిట్టుబాటు ధరలే ప్రధాన అంశాలుగా ఈ ఉద్యమం కొనసాగుతుందన్నారు. గిట్టుబాటు ధరను కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. మిర్చి ధర నానాటికీ దిగజారి 7వేల రూపాయలకు చేరిందని, పత్తి, వరి, కంది ధర దారుణంగా ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వలాభం గురించి ఆలోచిస్తూ రైతుల గురించి పట్టించుకోవడం మానివేశారని దుయ్యబట్టారు. రైతులకు న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు.