రాష్ట్రీయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 3: స్థానిక సంస్థల ద్వారా జరిగే శాసనమండలి ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. ఆరుచోట్ల ఏకగ్రీవం కాగా, మరో మూడు చోట్ల పోటీ జరగనుంది. చిత్తూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాల్లో స్థానిక సంస్థల ద్వారా జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరూ నామినేషన్లు వేయకపోవడం, బరిలో ఉన్న వారు ఆఖరు నిమిషంలో వైదొలగడంతో రంగంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయినట్లయింది. అయితే అనంతపురంలో జెసి మేనల్లుడయిన తెదేపా అభ్యర్ధి దీపక్‌రెడ్డికి చెమటలు పట్టించిన సీపీఐ అభ్యర్ధి పీలా నర్సింహయ్య ఆఖరి నిమిషంలో సీపీఐ అధిష్ఠానం రంగంలోకి దిగడంతో నామినేషన్‌ను ఉపసంహరించుకోక తప్పలేదు. అయితే, ఇదే అభ్యర్థి ఇటీవల తన నామినేషన్ ఉపసంహరించుకునేందుకు తన సంతకం ఫోర్జరీ చేసే కుట్ర జరిగిందని ఆరోపించి, ఇప్పుడు హఠాత్తుగా బరి నుంచి వైదొలగడం విస్మయం కలిగించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో మంత్రి పీతల సుజాత చొరవ తీసుకుని, బరిలో ఉన్న ఇతర అభ్యర్ధులతో రాయబారం నడపటంతో అక్కడ ఎన్నికలు లేకుండా ఏకగ్రీవమయింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం దొరబాబు (చిత్తూరు), చిక్కాల రామచంద్రరావు (తూర్పుగోదావరి), మంతెన సత్యనారాయణరాజు, అంగర రామ్మోహన్‌రావు (పశ్చిమ గోదావరి), శత్రుచర్ల విజయరామరాజు (శ్రీకాకుళం), దీపక్‌రెడ్డి (అనంతపురం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వైసీపీ అభ్యర్థులు కొనసాగుతున్నందున ఆ మూడు జిల్లాల్లో మాత్రం పోటీ నెలకొంది.
6న లోకేష్ నామినేషన్
కాగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఈనెల 6న ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఎమ్మెల్యే కోటాలో పార్టీ పొలిట్‌బ్యూరో ఆయనకు టికెట్ ఖరారు చేసిన విషయం తెలిసిందే.