రాష్ట్రీయం

డిజిటల్ తెలంగాణకు గూగుల్ దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3:గ్రామీణ ప్రాంతంలో మహిళలకు డిజిటల్ అక్షరాస్యత మొదలుకొని, స్టార్టప్‌లకు సాంకేతిక సహకారం అందించడం వరకు రాష్ట్రానికి సాంకేతిక సహకారం కోసం గూగుల్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వాల మధ్య శుక్రవారం కీలక ఒప్పందం కుదిరింది. తెలంగాణలో డిజిటలైజేషన్‌పై గూగుల్ ఇండి యా, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. గూగుల్ ఇండియా ప్రతినిధులు, ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె తారక రామారావుల మధ్య ఢిల్లీలో శుక్రవారం సమావేశం జరిగింది. టి-హబ్‌తో తెలంగాణలో సాంకేతిక అంశాల్లో గూగుల్ సహకారం అందిస్తుంది. ఈ ఒప్పందంతో గూగుల్ క్లౌడ్‌ను తెలంగాణ ఉపయోగించుకుంటుంది. టి-హబ్ స్టార్టప్‌లకు గూగుల్ మెంటర్‌గా ఉండి సహకరిస్తుంది. రాష్ట్రంలోని ఆన్‌లైన్ వ్యవహారాలు అన్నింటికీ గూగుల్ సాంకేతిక సహకారం అందిస్తుంది. రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా వ్యాపారులు ఆన్‌లైన్ వ్యవహారాలకు సేవలు అందిస్తుంది. బిటెక్, బిఇ, ఎంసిఎ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యంలో, మొబైల్ యాప్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తుంది. కల్చరల్ టూరిజం శాఖతో కలిసి ప్రాజెక్టు వర్క్‌లో భాగస్వామిగా ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించి సాంస్కృతిక, శిల్ప సంపదను చాటే ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తారు. తెలంగాణ చరిత్ర, ఇక్కడ సంపదను ప్రపంచం దృష్టికి తీసుకు వెళతారు.
ఈ ఒప్పందంలో భాగంగా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు డిజిటల్ సాథీ పేరుతో డిజిటల్ అక్షరాస్యత కల్పిస్తారు. స్వయం సహాయ బృందాల నుంచి మహిళలను ఎంపిక చేసి డిజిటల్ శిక్షణ ఇస్తారు. టాటా ట్రస్ట్ సహకారంతో ఈ కార్యక్రమం చేపడతారు. మహిళలు సాథీ పేరుతో తోటి మహిళలకు శిక్షణ ఇస్తారు.
సమావేశం అనంతరం గూగుల్ ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ చేతన్ కృష్ణ స్వామి మాట్లాడుతూ సాంకేతిక రంగంలో తెలంగాణ ముందుందని, తెలంగాణతో కలిసి పని చేస్తామని చెప్పారు. మహిళలు, విద్యార్థులు, చిన్న, మధ్య తరహా వ్యాపారులు, కొత్త వ్యాపారవేత్తలకు సహకరించే విధంగా పని కలిసి పని చేస్తామని చెప్పారు. ఇంటర్‌నెట్ ద్వారా ఈ వర్గాలు ప్రయోజనం కలిగే విధంగా గూగుల్ ఇండియా పని చేస్తుందని చెప్పారు. ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు సహకారానికి కృతజ్ఞతలు చెప్పారు.
తెలంగాణ అభివృద్ధిలో గూగుల్ ఇండియా సహకరిస్తోందని ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. మహిళలు, యువత, చిన్న వ్యాపారులు, విద్యార్థులకు ప్రయోజనం కలిగే విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, గూగుల్‌తో జరిగిన ఈ ఒప్పందం వల్ల వీరికి ఐటి ద్వారా మరింత మేలు కలుగుతుందని అన్నారు. గూగుల్‌తో కలిసి డిజిటల్ తెలంగాణ సాధించడమే తమ లక్ష్యమని అన్నారు. డిజిటల్ తెలంగాణ ప్రణాళికకు గూగుల్‌తో కలిసి పని చేయడం ఎంతో ఉపయోగపడుతుందని కెటిఆర్ తెలిపారు.