రాష్ట్రీయం

పొన్న వాహనంపై లక్ష్మీనృసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 3: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు శుక్రవారం స్వామివారు వటపత్రశాయి ఆలంకార సేవలో పొన్న వాహనంపై విహరించి భక్తులను పులకింపచేశారు. ప్రళయ కాలంలో మరో జగత్తును సృష్టించే క్రమంలో జగత్‌ద్రక్షుడైన స్వామివారు వటపత్రశయనుడైన వేళ.. లక్ష్మీనృసింహుడిని వటపత్రశాయిగా అలంకార సేవ చేసి కోరి న కోరికలు తీర్చే పొన్న (కల్పవృక్షం) వాహనంపై విహరింపచేశారు. ఆలయ ప్రధానార్చకులు నంధీగల్ నరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, యాజ్ఞికులు శ్రీనివాసచార్యుల నేతృత్వంలో వేదపారాయణ పఠనాల మధ్య శాస్ర్తియంగా స్వామివారికి అలంకార, విశేష వాహన సేవలు నిర్వహించారు. ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి పొన్న వాహన సేవలు నిర్వహించారు. దేవస్థానం ఈవో గీత, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి విశేష సేవల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత జానారెడ్డి దంపతులు బాల ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చిత్రం..వటపత్రశాయి అలంకార సేవలో లక్ష్మీనృసింహుడు