రాష్ట్రీయం

జాతి వ్యతిరేక శక్తులకు వంత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: వామపక్షాలు కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నాయని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ జాతి వ్యతిరేక శక్తులకు వామపక్షాలు వంత పలుకుతున్నాయని చెప్పారు. రాష్టప్రతి పదవికి తాను రేసులో లేనని స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశ ఆర్ధిక వ్యవస్థ పుంజుకుందని చెప్పారు.
దేశంలో వేలాది వర్శిటీలు ఉండగా కేవలం నాలుగైదు వర్శిటీల్లో మాత్రమే గొడవలు ఎందుకు జరుగుతున్నాయో అర్థం అవుతోందన్నారు. ఎన్నికల్లో తిరస్కరణకు గురైన కాంగ్రెస్, కమ్యూనిస్టులు కూడబలుక్కుని విశ్వవిద్యాలయాల్లో అశాంతిని రేపుతున్నాయని అన్నారు. తద్వారా తమ అస్థిత్వాన్ని చాటుకుంటున్నాయని చెప్పారు. కొత్త ఎత్తుగడలతో ప్రజల్ని కులాలు, మతాల పేరుతో చీలుస్తున్నాయని అన్నారు. జెకేఎల్‌ఎఫ్, సిమి, అల్‌ఉమతో పాటు నక్సల్ పార్టీలు కాంగ్రెస్ పాలనలోనే పెరిగాయని చెప్పారు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల్లో రోజురోజుకూ అసహనం పెరిగిపోతోందని, కశ్మీర్‌లో ప్రజలు భారత్‌తో పూర్తిగా వేరైపోయారన్న చిదంబరం వ్యాఖ్యలు కూడా ఈ అసహనం నుండే వచ్చాయని అన్నారు. జాతి వ్యతిరేక శక్తులే ఢిల్లీ, జెఎన్‌యు, జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయాల్లో రాంజాస్ కాలేజీలో ఆజాదీ అంటున్నారని, విద్యార్ధులను తప్పుదారిపట్టిస్తున్న విచ్ఛిన్నకర శక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలను తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.
కేరళలో వందలాది మందిని సిపిఎం ప్రేరేపిత తీవ్రవాదం హత్య చేస్తోందని ఆరోపించారు. కేరళ సిఎం తల తెచ్చిన వారికి కోటి రూపాయలు బహుమానంగా ఇస్తామన్న ప్రకటనను తాను ఖండిస్తున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదని వెంకయ్య నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి కూడా పాల్గొన్నారు.