రాష్ట్రీయం

బెజవాడ పోలీస్.. ఇక బాబీస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది బెజవాడ బస్టాండ్. అక్కడ ఇద్దరు వ్యక్తుల సంచారం అనుమానాస్పదంగా ఉంది. వాళ్లలో వాళ్లే తర్జనభర్జన పడుతున్నారు. చూడబోతే ఏదో పెద్ద కుట్రకే తెరలేపేటట్టున్నారు. ఈ దృశ్యాలు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కంప్యూటర్ల ఎదుట కూర్చున్న పోలీసుల కంటపడ్డాయి. సీసీ కెమెరాలను అటువైపు జూమ్ చేశారు. స్థానిక పోలీసులకు వైర్‌లెస్ సెట్లో ఆదేశాలు పంపారు. ఆ ఇద్దరు అగంతకుల్నీ ఫాలో చేసేందుకు నానో డ్రోన్ గాల్లోకి లేచింది. ఇద్దరూ ఓ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లారు. వారు అలా వెళ్లి ఇలా బయటకొచ్చారో లేదో పోలీసులు అక్కడ ప్రత్యక్షమై, వారిని అదుపులోకి తీసుకున్నారు.
- ఇదంతా ఓ కథలా అనిపించవచ్చు. కానీ మరికొద్ది రోజుల్లో బెజవాడలో ఇదే నిజం కాబోతోంది. ఇప్పటికే డ్రోన్లు, సీసీ కెమెరాలను వినియోగించుకుంటున్న పోలీసులు దాని సాయంతో నేరాలు అరికట్టి, లండన్ ‘బాబీస్’ మాదిరిగా ఫ్రెండ్లీగా మారబోతున్నారు.
**
విజయవాడ (క్రైం), మార్చి 4: లండన్‌లోని పోలీసులను జనం ముద్దుగా ‘బాబీస్’ అని పిలుచుకుంటారు. ఎందుకంటే అక్కడ పోలీసులు మన మాదిరిగా, లేదా అమెరికా తరహాలో తుపాకులతో కనిపించరు. అరుదైన సంఘటనల్లో తప్ప వారు తుపాకులు చేతబట్టరు. కానీ నేరగాళ్లను ఇట్టే పసిగట్టేస్తారు. కారణం వారికున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. ప్రజలతో ఫ్రెండ్లీగా వ్యవహరిస్తారు. కంట్రోల్ రూమ్‌లో కూర్చుని నేరగాళ్లతోపాటు ప్రజల కదలికలను కనిపెట్టి, కనీస బలగాలతో అక్కడి నుంచే పోలీసులకు ఆదేశాలిచ్చే లండన్ బాబీస్ విధానం త్వరలో ఏపి రాజధాని నగరమైన అమరావతిలోనూ కనిపించనుంది. దేశంలోనే తొలిసారి కమాండ్ కంట్రోల్ రూమ్ విధానానికి శ్రీకారం చుట్టి, అదే విధానం అన్ని శాఖల్లోనూ రూపొందించేలా చేసిన టెక్నికల్ మాస్టర్ విజయవాడ పోలీసు కమిషనర్ దామోదర గౌతం సవాంగ్ విజయవాడకు బాబీస్‌ను తీసుకువచ్చేందుకు లండన్ వెళ్లనున్నారు. రాష్ట్ర పోలీసు శాఖ తన స్వరూపం మార్చుకుంటూనే సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగంలోకి తీసుకురానుంది. లండన్, అమెరికా తదితర దేశాల్లో ప్రస్తుతం అమలవుతున్న పోలీసింగ్‌ను గమనిస్తూనే, ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా పని విధానం మార్చుకోనుంది. ప్రజలకు చేరువగా ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ను తీసుకెళ్ళేందుకు ఆయుధాలు పక్కన పెట్టనుంది. లండన్ ‘బాబీస్’ తరహాలో ఈ నూతన సాంకేతిక ప్రజాపోలీసింగ్‌ను విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనిపై అధ్యయనం కోసం గతంలో యుఎన్‌ఓలో పనిచేసిన అనుభవం ఉన్న గౌతం సవాంగ్‌ను లండన్‌కు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 6న ఆయన లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ మూడు రోజులపాటు పోలీసింగ్, టెక్నాలజీకి సంబంధించి జరిగే అంతర్జాతీయ వర్క్‌షాపులో పాల్గొంటారు. సదస్సు సందర్భంగా అక్కడ నిర్వహించే ఎగ్జిబిషన్‌లో పలు దేశాల్లో పోలీసు పనితీరు, వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ప్రదర్శన ఉంటుంది. ఆ తర్వాత సవాంగ్ ‘కమాండ్ ఇన్ కంట్రోల్’ వ్యవస్థపై మరింత అధ్యయనం చేయనున్నారు. రాష్ట్ర పాలనలో భాగమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ రూపకర్త సవాంగేనన్నది చాలామందికి తెలియని విషయం. విజయవాడలో ప్రస్తుతం విజయవంతంగా నడుస్తున్న కమాండ్ కంట్రోల్ వ్యవస్థకు జాతీయ స్థాయిలో అమలవుతున్న సాంకేతిక హంగులు అద్ది, నేరాలను మరింత తగ్గించేందుకు కమిషనర్ లండన్ పర్యటన దోహదపడనుంది.
బాబీస్ అంటే ఇదీ!
ఆయుధాలే పట్టని పోలీసింగ్ వ్యవస్థ బ్రిటిషుదైతే.. ఆయుధాలు ధరించనిదే పోలీసింగ్ లేని విధానం అమెరికాది! యూరప్ దేశాల్లో పోలీసు విధానం అక్కడి పరిస్థితులకు అనుగుణంగా అమలవుతుంది. యునైటెడ్ కింగ్‌డమ్ పోలీసులను అక్కడి ప్రజలు ‘బాబీస్’ అని పిలుచుకుంటారు. తలపై ధరించే టోపీ, యూనిఫారం వేషధారణ, ప్రవర్తన తదితర అంశాల్లో యుకె పోలీసు భిన్నంగా ఉండటమే ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’కు దోహదపడుతోంది. అలాగని వృత్తివిధానంలో మాత్రం రాజీ పడరు. పోలీసు బలగాలను కనీసంగా వినియోగిస్తూనే, సేవలు మాత్రం విస్తారంగా అందించడం అక్కడి ప్రత్యేకత. టెక్నాలజీ విషయానికొస్తే, లండన్‌తోపాటు అమెరికా పోలీసింగ్ అనుసరించే ఆత్యాధునిక సాంకేతిక తరహాలో అమలు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఇప్పటికే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వినియోగంలో చాలాదూరం వచ్చేసిన విజయవాడ పోలీసు కమిషనరేట్, మరింతగా ముందుకెళ్లేందుకు గౌతం సవాంగ్ లండన్ పర్యటన సాయపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

చిత్రం..కమాండ్ కంట్రోల్ రూమ్‌లో విజయవాడ పోలీసు కమిషనర్ గౌతం సవాంగ్