రాష్ట్రీయం

టార్గెట్ మిడ్‌మానేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: పెండింగ్ పనులు పూర్తి చేసి ఖరీఫ్‌లో ఎస్‌ఆర్‌ఎస్‌పి స్టేజ్ 2 కింద మూడు లక్షల 97 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్టు నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మిడ్‌మానేరు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని, ఈ ఏడాది 25 టిఎంసి, ఎల్‌ఎండి నుంచి 25 టిఎంసి జలాలు విడుదల చేయనున్నట్టు చెప్పారు. 50 టిఎంసి నీటిని విడుదల చేయనున్నందున ఎస్‌ఆర్‌ఎస్‌పి స్టేజ్ 2కు చెందిన కాల్వలన్నింటినీ పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఆదేశించారు. జలసౌధలో శనివారం ఎస్‌ఆర్‌ఎస్‌పి స్టేజ్ 2 పనుల పురోగతిని విద్యుత్ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి సమీక్షించారు. ప్యాకేజీల వారిగా పనులు జరుగుతున్న తీరు, భూ సేకరణ పనులతో పాటు కాలువల పరిస్థితిని సమీక్షించారు. ప్యాకేజీ పనులన్నీ ఖరీఫ్‌లోగా పూర్తి చేయాల్సిందేనన్నారు. టార్గెట్ ప్రకారం పనులు పూర్తి చేయాలని, నిర్లక్ష్య ధోరణి, అలసత్వాన్ని సహించేది లేదని హరీశ్‌రావు చెప్పారు. ఇకపై సమర్ధవంతంగా పనిచేయని అధికారులను డిమోట్ చేస్తామని మంత్రి హెచ్చరించారు. ఇంజనీరింగ్ అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పర్యటనలు జరపాలన్నారు. కాల్వల వెంట స్వయంగా తిరిగితేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులుతో నిరంతరం సంప్రదిస్తూ క్షేత్రస్థాయిలో ఎదురయ్యే
సమస్యలు తెలుసుకోవాలన్నారు. భూసేకరణలో ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించుకోవాలని డిఇ నుంచి ఎస్‌ఇ వరకూ మంత్రి సూచించారు. సమావేశంలో తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాశ్, ఎంఎల్‌ఏ గ్యాదరి కిషోర్, ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి, ఇఎన్‌సి మురళీధరరావు, సిఇ నాగేందరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఎత్తిపోతల నుంచి ఖరీఫ్‌లో సాగునీరు
ఐడిసి చేపట్టిన ఎత్తిపోతల పధకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఖరీఫ్‌లో సాగునీరు అందించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా ఎత్తిపోతల పథకాల పురోగతిని శనివారం మంత్రి సమీక్షించారు. 2012కు ముందు ప్రారంభించిన పథకాల పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని టిఎస్‌ఐడిసి అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంట్రాక్టు ఒప్పందం గడువు లోగా పని పూర్తి చేయని ఏజెన్సీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలన్నారు. కొద్ది పనులు మాత్రమే మిగిలి ఉండి, ముగింపు దశలో ఉన్న ఎత్తి పోతల పథకాలను గుర్తించి వాటిని పూర్తి చేయాలని సూచించారు. టిఎస్‌ఐడిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, ప్రభుత్వ ఇరిగేషన్ కార్యదర్శి వికాస్ రాజు, టిఎస్‌ఐడిసి ఎండి శ్రీదేవి ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.