రాష్ట్రీయం

బాబు తీరు బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోయ అభివృద్ధి చెందుతున్న దశలో రెచ్చగొట్టే విధంగా ఆంధ్ర సిఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని గవర్నర్ నరసింహాన్ వద్ద తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 10 నుంచి ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాలకు గవర్నర్‌ను లాంఛనంగా ఆహ్వానించేందుకు కెసిఆర్ శనివారం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. కెసిఆర్ గవర్నర్‌ను కలిసి వెళ్లిన తరువాత అసెంబ్లీ సమావేశాలపై నోటిఫికేషన్ వెలువడింది. ఇదిలావుంటే, భేటీలో తెలంగాణ ఏర్పాటుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కెసిఆర్ గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చారు. విడిపోయ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఆంధ్ర అసెంబ్లీని ప్రారంభిస్తూ తెలంగాణ ఏర్పాటు చీకటి రోజని చంద్రబాబు వ్యాఖ్యానించటం ఎంతమాత్రం సరికాదని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత ఎలాంటి అవాంచనీయ సంఘటన తలెత్తలేదని, ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా కలసిమెలసి ఉంటున్నారని అన్నారు. తిరుపతిలో భారీ కటౌట్లతో తనకు స్వాగతం పలికారని కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. నోట్ల రద్దు తరువాత రాష్ట్రానికి కలిగే నష్టంపై గవర్నరే కేంద్రానికి వివరిస్తే మంచిదని కోరారు. బడ్జెట్‌పై నోట్ల రద్దు ప్రభావం పెద్దగా ఉండదంటూనే, సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్టు వివరించారు. ఇదిలావుంటే, శాసనమండలి, శాసన సభ బడ్జెట్ సమావేశాలు 10 నుంచి ప్రారంభించేందుకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్
శనివారం నోటిఫికేషన్ జారీ చేసినట్లు లెజిస్లేచర్ సెక్రటరీ ఎస్ రాజాసదారామ్ జీవో విడుదల చేశారు. 10న ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. అనంతరం స్పీకర్ ఎస్. మధుసూదనాచారి శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశాన్ని నిర్వహిస్తారు. కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ తన ఛాంబర్‌లో కౌన్సిల్ బిఎసి నిర్వహిస్తారు. 29న ఉగాది పర్వదినం ఉన్నందున అంతకుముందే ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించుకుని, మిగతా అజెండా పూర్తి చేసి సమావేశాలు ముగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. కాగా ఉగాది పర్వదినం తర్వాత కూడా సమావేశాలు నిర్వహించుకుంటే తప్పేమిటీ అని, అనేక ప్రజా సమస్యలు ఉన్నాయని, వాటిపై సమగ్రంగా చర్చించి పరిష్కరించాల్సి ఉందని ప్రతిపక్షాల నేతలు అంటున్నారు.

చిత్రం..రాజ్‌భవన్‌లో శనివారం గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయన ముఖ్యమంత్రి కెసిఆర్