జాతీయ వార్తలు

కృష్ణా జలాలను మళ్లీ కేటాయించాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: కృష్ణా జలాలను పునఃకేటాయించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఈ నెల 13వ తేదీన విచారించనుంది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కొత్తగా అవతరించినందు వల్ల నదీ జలాలను పునఃకేటాయించి రాష్ట్రానికి న్యాయం చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులను పునస్సమీక్షించాల్సిన అవసరం లేదంటూ కేంద్రం సుప్రీంకు తెలిపింది. కాగా సంపూర్ణమైన నివేదిక ఇవ్వాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నదీజలాల కేటాయింపును పునస్సమీక్షించాలన్న తెలంగాణ వాదనకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వివిధ సందర్భాల్లో కలిసినప్పుడు ఈ విషయం చర్చకు వచ్చినట్లు ఇరిగేషన్ వర్గాలు తెలిపాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టులు మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా పోరాడి కేంద్రంపై వత్తిడి తేవడం, సుప్రీం కోర్టులో తెలంగాణ వాదనకు బలం చేకూరే విధంగా ఇంప్లీడ్ కావడంపై ఆంధ్రప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది.