రాష్ట్రీయం

భారతీయులకు భద్రత కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: అమెరికాలో ఉన్న భారతీయులకు రక్షణ కల్పించేలా చూడాలని ప్రధాని నరేంద్రమోదీని కోరుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఇటీవల అమెరికాలో జరిగిన కన్సాస్ కాల్పుల ఘటనలో మరణించిన కూచిబొట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను హైదరాబాద్‌లో ఆయన పరామర్శించారు. శనివారం బోరంపేటలోని శ్రీనివాస్ నివాసానికి వెళ్లి చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అనంతరం శ్రీనివాస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘శ్రీనివాస్ మృతి చాలా బాధిస్తోంది, తన తెలివితేటలతో అమెరికా వెళ్లి మన దేశానికి కూడా ఉపయోగపడాలని శ్రీనివాస్ భావించాడు, ఆ తర్వాత సునయిన కూడా అమెరికా వెళ్లడం, ఇద్దరూ కలిసి బాగా చదువుకుని ముందుకు వచ్చారు, అలాంటి సమయంలో ఈ దుర్ఘటన జరిగింది, ఇది దారుణం’ అని చంద్రబాబు అన్నారు. ఈ ఘటన తర్వాత సునయిన మాట్లాడిన మాటలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. మంచి భవిష్యత్ ఉంటుందని అంతా అమెరికా వెళ్తున్నారు, శ్రీనివాస్ ఘటన అమెరికాలో అభద్రతా భావాన్ని సృష్టించిందని అన్నారు.
ఈ ఘటనపై అమెరికా స్పందించేంత వరకూ ఒత్తిడి తీసుకురావాలని పేర్కొన్నారు. శ్రీనివాస్ భార్య సునయిన విజ్ఞప్తి మేరకు త్వరలోనే ప్రధాని మోదీని కలుస్తానని అన్నారు. ఎంతో మంది తెలివైన వాళ్లు కలిసి పనిచేస్తేనే అమెరికా అభివృద్ధి చెందిందని, ఇలాంటి దాడులపై అక్కడి ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. చంద్రబాబునాయుడు వెంట కేంద్ర మంత్రి సుజనా చౌదరి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు ఎల్ రమణ, రేవంత్‌రెడ్డి, పెద్దిరెడ్డి తదితరులున్నారు.
శివశంకర్ కుటుంబ సభ్యులకు పరామర్శ
అనంతరం చంద్రబాబునాయుడు ఇటీవల కన్నుమూసిన మాజీ గవర్నర్ పి శివశంకర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. శివశంకర్ భార్య లక్ష్మీభాయిని ఓదార్చారు. చంద్రబాబునాయుడు శివశంకర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. అనంతరం శివశంకర్ ప్రతిభాపాటవాలను గుర్తుచేశారు. శివశంకర్‌తో తనకున్న అనుబంధాన్ని వివరించారు.

చిత్రం..శనివారం హైదరబాద్‌లో అమెరికాలో మరణించిన కూచిబొట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులను
పరామర్శిస్తున్న ఏపి సిఎం చంద్రబాబు నాయుడు