ఆంధ్రప్రదేశ్‌

విశ్వశాంతి యోగి విశ్వంజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (కల్చరల్), మార్చి 5: సమాజంలో అడుగంటిపోతున్న మానవతా విలువల సముద్ధరణ కోసం విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ తన తపోధ్యాన శక్తిని ధారపోస్తున్నారని ఏపి శాసనసభా ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. విశ్వజనీనమైన ప్రేమభావనలు ప్రతి ఒక్కరిలో వెల్లివిరిసేలా చేయటమే విశ్వంజీ ఆశయమని ఆయన అన్నారు. ఆదివారం రాత్రి గుంటూరు సమీపంలోని చినకొండ్రుపాడు విశ్వనగర్‌లో విశ్వంజీ మహరాజ్ 73వ జన్మదినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈసందర్భంగా జరిగిన సభలో బుద్ధప్రసాద్ అధ్యక్షోపన్యాసం చేస్తూ విశ్వంజీ అనునిత్యం సమాజంలోని ప్రతి ఒక్కరిపై ప్రేమామృతధారలు వర్షింపజేస్తూనే ఉంటారన్నారు. ఎలాంటి స్వార్థచింతన లేకుండా ప్రేమతత్వంతో యావత్ విశ్వ శ్రేయస్సును విశ్వంజీ ఎల్లప్పుడూ కాంక్షిస్తూనే ఉంటారన్నారు.
విమ్స్ ప్రాంగణంలో క్షిపణి పితామహుడు డాక్టర్ అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, తాను ఆవిష్కరించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానన్నారు. విశ్వంజీ జన్మదినోత్సవాలలో భాగంగా రోజంతా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్య అతిథి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ విశ్వంజీతో తనకు పదేళ్ల అనుబంధం ఉందని, ఆయన ఆశీస్సులు నూతన ఆంధ్రప్రదేశ్‌కు, రాజధాని అమరావతికి, రాష్ట్ర ప్రజలకు ఎల్లప్పుడూ అవసరమన్నారు.
రాష్ట్రానికి సమర్థవంతమైన మంచి నాయకత్వం కావాలని తాను అనేక సందర్భాల్లో విశ్వంజీని కోరానని, సమర్థుడైన చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని స్వామీజీ ముందుగానే చెప్పారని రాఘవరావు ఈసందర్భంగా గుర్తుచేశారు.
అరమరికల్లేని ఆత్మబంధువు:
ఎంవిఆర్ శాస్ర్తీ
విశ్వంజీ జన్మదినోత్సవ వేడుకల్లో ఎప్పుడు పాల్గొన్నా ఒక దివ్యానుభూతి కలుగుతుందని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ చెప్పారు. అరమరికలు లేని ఆత్మబంధువు విశ్వంజీ అని ప్రశంసించారు. విశ్వంజీ జన్మదినోత్సవ వేడుకల్లో ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత కనిపిస్తోందని, దేశ కీర్తిప్రతిష్ఠల్ని ప్రపంచం నలుదిశలా మార్మోగేలా చేసిన డా. అబ్దుల్ కలాం కాంస్య విగ్రహాన్ని విశ్వనగర్‌లో ఏర్పాటు చేయడం ఎంతైనా ప్రశంసనీయమన్నారు.
సిఐడి ఎస్పీ కోటేశ్వరరావు స్వామీజీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి స్వామీజీ ఆశీస్సులు ఎల్లప్పుడూ తనకు తోడు ఉంటూనే ఉన్నాయన్నారు. న్యాయమూర్తి నాగమారుతిశర్మ, శ్రీకాళహస్తి శుకబ్రహ్మాశ్రమం కార్యదర్శి కె ఈశ్వర్, విశ్వమానవ సమైక్యతా సంసద్ కన్వీనర్ ఆకుల కోటేశ్వరరావు, ఆకుల ఈశ్వరి, తదితరులు పాల్గొన్నారు.