ఆంధ్రప్రదేశ్‌

గోఖలేను సన్మానించిన విశ్వంజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: ప్రముఖ గుండె వైద్య నిపుణుడు (కార్డియో, థెరాసిక్ సర్జన్) డాక్టర్ ఎ.గోపాలకృష్ణ గోఖలేను ఆదివారం గుంటూరు సమీపంలోని విశ్వనగర్‌లో భగవాన్ విశ్వయోగి విశ్వంజీ సన్మానించారు. విశ్వంజీ 73వ జన్మదినం సందర్భంగా విశ్వనగర్‌లోని ఆడిటోరియంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. గోపాలకృష్ణ గోఖలేకు కేంద్రప్రభుత్వం ఇటీవలే పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పురస్కారం ప్రదానం చేసింది. గోఖలే గుండె వైద్యానికి సంబంధించి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కీర్తి గడించారు. ఈ సందర్భంగా విశ్వంజీ మాట్లాడుతూ గోఖలే సేవలు హృద్రోగులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని శ్లాఘించారు. గోఖలే గురించి ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ మాట్లాడుతూ గోఖలేకు పద్మశ్రీ అవార్డు లభించడంతో ఆ అవార్డుకే గౌరవం పెరిగిందని పేర్కొన్నారు. డాక్టర్ గోఖలేను సన్మానించడం వైద్యరంగానికి సమున్నత స్థానం కల్పించినట్లయిందని అన్నారు. విశ్వయోగి విశ్వంజీ ఆశీస్సులు, డా. గోఖలే అందించిన వైద్యసేవలు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని శాస్ర్తీ తెలిపారు. ఈ సందర్భంగా గోఖలేను ఎపి శాసనసభ ఉపసభాపతి మండలి బుద్దప్రసాద్, రోడ్లు భవనాల మంత్రి శిద్ధా రాఘవరావు తదితరులు అభినందిస్తూ మాట్లాడారు. తనకు జరిగిన సత్కారానికి డా. గోపాలకృష్ణ గోఖలే స్పందిస్తూ.. విశ్వంజీ ఆశయాలు, ఆకాంక్ష, సంకల్పం మహత్తరమైనవని చెప్పారు. సామాన్యులు, పేదలకు ఎల్లప్పుడూ తాను వైద్యపరంగా అందుబాటులో ఉంటానని, విశ్వంజీ చేపట్టే సామాజిక, వైద్యసేవలకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని డా. గోఖలే వివరించారు.

chitram...
డా. గోఖలేను సన్మానిస్తున్న విశ్వయోగి విశ్వంజీ మహరాజ్