తెలంగాణ

కోదండరామ్ వౌనమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: తెలంగాణ జెఎసి భవిష్యత్తుపై కమిటీ సభ్యుల్లో ఆందోళన ఆరంభమైంది. టిజాక్ భవిష్యత్తులో రాజకీయ పార్టీగా అవతరిస్తుందా? లేక జెఎసి చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ మరో రాజకీయ పార్టీలోకి వెళ్ళనున్నారా? అలా వెళితే జెఎసి భవిష్యత్తు ఏమవుతుంది? కొత్తగా ఎవరైనా బాధ్యత స్వీకరించి ముందుకు నడిపిస్తారా.. జాక్ అంతర్ధానమవుతుందా? అనే ప్రశ్నలు అనుమానాలు, సందేహాలను జాక్‌లోని చాలామంది నేతలు వ్యక్తం చేస్తున్నారు.
తాను వేరే పార్టీలో చేరినా టిజాక్ యథావిధిగా కొనసాగుతుందని కోదండరామ్ ఇటీవల మీట్‌దిప్రెస్‌లో అన్నారు. దీంతో టిజాక్‌ను రాజకీయ పార్టీగా మార్చే ఆలోచన ఆయనకు లేదని దాదాపు స్పష్టమైంది. కానీ రాజకీయ పార్టీగా జెఎసి అవతరించకపోతే అది నిర్వహించే కార్యకలాపాలు, కార్యక్రమాలు ఏమీ ఉండవని కొందరు అంటున్నారు. తెలంగాణ ఏర్పాటైంది కాబట్టి ఇక జెఎసితో పనేమి ఉండదని, దానిని రాజకీయ పార్టీగా మార్పు చేస్తేనే భవిష్యత్తు ఉంటుందన్న అభిప్రాయాన్ని మరికొందరు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్-వామపక్షాలను కలుపుకుని ఎన్నికల బరిలో దిగితే టిఆర్‌ఎస్ పట్ల, ముఖ్యమంత్రి కెసిఆర్ పట్ల అసహనంతో ఉన్న ప్రజాసంఘాలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయని వారు వాదిస్తున్నారు.
అయితే, కోదండరామ్ ఒంటెద్దు పోకడ పోతున్నారని, ఏ విషయాన్నీ స్టీరింగ్ కమిటీలో చర్చించకుండా స్వతహాగా నిర్ణయం తీసుకుని మీడియాకు వెల్లడిస్తున్నారని టిజాక్ వైస్-చైర్మన్ ప్రహ్లాద్, రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవీందర్, కో-కన్వీనర్ తన్వీర్ సుల్తానా ఈ నెల 1న బహిరంగంగా విమర్శించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరహాలో మరో రాజకీయ పార్టీ అవశ్యకత ఉందని ప్రొఫెసర్ కోదండరామ్ ప్రకటించడంపైనా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టి.జెఎసిని రాజకీయ పార్టీగా మార్చబోమని చెబుతూనే మరో రాజకీయ పార్టీ అవసరం ఉందని సంకేతం ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటీ?, కొత్త పార్టీ రూపకల్పన ఎవరు చేస్తున్నారు? ఇటువంటి విషయాలన్నీ చర్చించేందుకు స్టీరింగ్ కమిటీ సమావేశంలో ప్రకటించకుండా బయట బహిర్గతం చేయడాన్ని జెఎసి సభ్యులు తప్పుపడుతున్నారు. ఏదైనా స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించాలని వారు పట్టుబడుతున్నారు. కోదండరామ్‌కు వేరే పార్టీలో చేరాలన్న ఆలోచన ఉన్నా, తామెవ్వరమూ అడ్డుపడమని, లేదా టిజెఎసిని పార్టీగా మార్చాలనుకుంటే స్టీరింగ్ కమిటీలో ఎంత మంది ఆమోదిస్తారో, ఆమోదించరో తేలిపోతుందని వారు చెబుతున్నారు. ఇంత కీలకమైన అంశాలపై చర్చించేందుకు స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించకుండా కోదండరామ్ కాలయాపన చేయడం తగదని కొందరు అంటున్నారు. నిరుద్యోగ నిరసన ర్యాలీ అనంతరం 30కి పైగా విద్యార్థి సంఘాలతో కోదండరామ్ చర్చించినట్లే, టిజాక్ భవిష్యత్తుపైనా స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించాలని వారు ఒత్తిడి తెస్తున్నారు.