రాష్ట్రీయం

తూ.గో.లో 41 అడుగుల మలేషియన్ మురుగన్ విగ్రహావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదపూడి, మార్చి 5: తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలోని శ్రీ స్వామి అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన 41 అడుగుల మలేషియన్ మురుగన్ సాలగ్రామ విగ్రహ ప్రతిష్ఠ ఆదివారం వైభవంగా జరిగింది. విగ్రహ నిర్మాత ద్వారంపూడి వెంకటరెడ్డి (చింతపండు), పద్మ దంపతులు ప్రత్యేక పూజలు చేసి స్వామివారి విగ్రహ ప్రతిష్ఠచేశారు. రుత్విక్కులు పెద్దింటి పద్మనాభాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం నుంచి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అలాగే శాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహించా రు. విగ్రహాన్ని అత్యద్భుతంగా మలచిన సంపర గ్రామానికి చెందిన శిల్పి నాగిరెడ్డి వెంకన్నను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు భారీ అన్నసమారాధన ఏర్పాటు చేశారు. స్వామివారిని అనపర్తి నియోజకవర్గ వైసిపి కన్వీనర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు, కెపిఆర్ సంస్థల ఛైర్మన్ కొవ్వూరి పాపారెడ్డి, మండపేట వైసిపి కన్వీనర్ వేగుళ్ల లీలాకృష్ణ, కాకినాడ ద్వారంపూడి ఛారిటబుల్ ఆర్గనైజర్ కర్రి వీర్రెడ్డి, సత్తి భగవాన్‌రెడ్డి, రాజారెడ్డి, డిఆర్‌కె రెడ్డి దర్శించుకున్నారు.