రాష్ట్రీయం

వృద్ధికి ఊతం.. రైతుకు పట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 6: ఆంధ్ర ప్రదేశ్‌లో సరికొత్త శకానికి తెరలేచింది. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి సొంత అసెంబ్లీ లేక ఇక్కట్లు పడ్డ రాష్ట్రానికి ఆ కొరత తీరింది. సొంత రాష్ట్రంలో..అదీ సొంత అసెంబ్లీ భవనంలో సోమవారం బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలనుద్దేశించి మాట్లాడిన గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ రాష్ట్ర ప్రగతిని కళ్లకు కట్టారు. అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో ప్రజా సంక్షేమం కోసం గట్టిగా కృషి చేస్తున్నామని, ఈ ప్రయత్నాల వల్ల ఆంధ్రప్రదేశ్ 2022 నాటికి దేశంలోనే అగ్రగామిగా నిలువగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 2029 నాటికి దేశంలో ఉత్తమ రాష్ట్రంగా అంతిమంగా 2050 నాటికి అత్యంత ప్రాధాన్యత గల ప్రపంచ పెట్టుబడి కేంద్రంగా రూపొందడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్పష్టతతో పురోగమిస్తోందన్నారు. 2017-18 బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ సోమవారం ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అందించే నిధుల వినియోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందంటూ అన్ని రాష్ట్రాలకు కేంద్రం సమకూరుస్తున్న ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ కేటగిరి నిధులను గరిష్ఠంగా వినియోగించుకుంటున్న కొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటన్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమం ఉపాధి కల్పనకు మాత్రమే కాకుండా ఆస్తుల కల్పనకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఒక్క ఏడాది కాలంలోనే ఈ పథకం కింద రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 9వేల 900 కిమీ సిసి రోడ్లను వేయడమే ఇందుకు నిదర్శనమన్నారు. పైగా పనిచేసిన కార్మికులందరికీ 15 రోజుల్లోనే 90 శాతం చెల్లింపులు జరిపామనే విషయానికి కూడా అంతే ప్రాధాన్యత ఉందన్నారు. తమ ప్రభుత్వం వివిధ రైతు అనుకూల కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినప్పటికీ కొందరు నకిలీ, కల్తీ విత్తన ఉత్పత్తిదారులు డీలర్ల ముసుగులో రైతుల ప్రయోజనాలకు హాని కలుగచేస్తున్నందున ఈ బెడదను అరికట్టేందుకు ప్రత్యేక విత్తన చట్టం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీనివల్ల నేరస్తులకు కఠిన శిక్షలు విధించడానికి వీలవుతుందన్నారు. ఏది ఏమైనా రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచటం తమ బాధ్యత అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మారిందని, వ్యవసాయాన్ని లాభదాయకమైన వృత్తిగా రూపొందించడానికి, అలాగే శీగ్ర పారిశ్రామికీకరణ కోసం వ్యవస్థీకృత సంస్కరణలను కూడా చేపట్టిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయంటూ ఏడాది క్రితం తొలిసారి విశాఖపట్టణంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ.4.67 లక్షల కోట్ల విలువైన 328 పెట్టుబడి ప్రతిపాదనలు రాగా రెండోదఫాగా గత జనవరిలో జరిగిన భాగస్వామ్య సదస్సులో 23.34 లక్షల మందికి ఉపాధి కల్పించేలా రూ.10.54 లక్షల కోట్ల విలువ కల్గిన 665 అవగాహన ఒప్పందాలు జరిగాయన్నారు. దీంతో రాష్ట్ర నాయకత్వంపై పెట్టుబడిదారులకు, ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసం దీనివల్ల సుస్పష్ట మవుతున్నదన్నారు.
యువతకు ఉపాధిని కల్పించడం అనేది తమ ప్రాధాన్యత జాబితాలో అగ్రభాగాన కొనసాగుతున్నదన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు తగినంత ఉపాధి కొరవడినా ప్రమాణాలు లేని యువతకు సర్వహంగులతో కూడిన నైపుణ్యాలను బోధించడానికి సమష్టి నైపుణ్య చర్యలు, నిర్మాణాత్మకమైన, సుస్థిరమైన, ముఖ్యంగా ఉపాధికి ఊతమిచ్చే పటిష్టమైన నైపుణ్య అభివృద్ధి వ్యూహాలను కల్పించడానికి ప్రముఖ సంస్థలతో తమ ప్రభుత్వం కలిసి పనిచేస్తోందన్నారు.
పేదరికాన్ని రూపుమాపి సాధికారతను పెంచడానికి తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని చెప్పిన గవర్నర్ ‘అన్న ఎన్టీఆర్’ క్యాంటిన్ ఇందులో భాగమన్నారు. అసంఘటిత కార్మికుల కుటుంబాలను ఆపదలో ఆదుకోటానికై చంద్రన్న బీమా సామాజిక భద్రతా పథకాన్ని ప్రవేశపెట్టామని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, కాపులు, బ్రాహ్మణుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. కాపులతో పాటు ఇతర ఆర్థికంగా వెనుకబడిన కులాలను వెనుకబడిన తరగతుల కేటగిరీలో చేర్చే విషయమై అధ్యయనం చేయడానికి తమ ప్రభుత్వం జస్టిస్ కెఎల్ మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేసిందన్నారు. కమిషన్ నివేదిక అందిన వెంటనే బిసిల ప్రయోజనాలకు భంగం కలుగకుండా కమిషన్ సిఫార్స్‌లను అమలుచేయడానికి తమ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోగలదన్నారు. అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలనేది తమ ఆకాంక్ష.. ఆ లక్ష్యాన్ని సాధించడంలో తమ ప్రభుత్వం ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుందన్నారు. భారతదేశం మొత్తానికే కాదు బహుశా ప్రపంచంలోనే ఒక ఆదర్శప్రాయంగా ఉంటుందనేది తమ ప్రగాఢ నమ్మకం అన్నారు. అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ రాజధాని నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు.

చిత్రాలు..నవ్యాంధ్ర నూతన అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ నరసింహన్