రాష్ట్రీయం

ఇదో అపూర్వ ఘట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 6: ‘నవ్యాంధ్ర పునర్నిర్మాణాన్ని జీరో నుంచి ప్రారంభించాం. సొంత గడ్డపై శాసనసభ సమావేశాల నిర్వహణ చారిత్రాత్మకం. పదేళ్లపాటు హైదరాబాద్‌లో అవకాశం ఉంది. అయితే ప్రజల్లో నమ్మం కలగాలి. వారి మనోభావాలు దెబ్బతినకూడదని ఇక్కడి నుంచయితే సుపరిపాలన సాగుతుందనే లక్ష్యంతో పాలనా వ్యవస్థను ఇక్కడికి తరలించామ’ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. వెలగపూడిలో ఏపి నూతన శాసనసభలో తొలి సమావేశాల అనంతరం ఆయన మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. ‘రాజధాని ఎక్కడ ఉన్నదో తెలీని పరిస్థితుల్లో అమరావతిని ఎంపికచేస్తే కొందరు అడ్డంకులు కల్పించారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా నిర్మిస్తున్నాం. అందుకు రైతులు కూడా ఆతిథ్యమిచ్చి భూములు త్యాగం చేశారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇలాంటి సందర్భం లేదు’ అని అన్నారు. గవర్నర్ ప్రసంగం చరిత్రలో చిరస్థాయి గా నిలుస్తుందన్నారు. ‘విభజన సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయి. ఇప్పటికీ అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు సహకరించారు. ఈ పరిస్థితుల్లో నవనిర్మాణ దీక్ష చేపట్టాం. కష్టాల్లో ఉన్నప్పుడు వెనక్కు తగ్గితే నష్టపోతాం. కసితో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో రాజీపడే ప్రసక్తిలేద’ని బాబు తేల్చిచెప్పారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్, ఇంధన పొదుపు, మిగులు విద్యుత్, జలవనరుల నిర్వహణ, ఇ గవర్నెన్స్, మీకోసం, ఆర్థిక నియంత్రణలో దేశం మొత్తంగా రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందన్నారు. భూములిచ్చినందుకు ప్రతిఫలంగా రైతులను సంతృప్తిపరిచామన్నారు. ‘ఇంకా రాజధాని ప్రాంతంలో గ్రామీణ వాతావరణం నెలకొంది. శాసనసభ, సచివాలయ భవనాల నిర్మాణం జరిగినా ఈ ప్రాంత అభివృద్ధి తలచుకుంటే ఒక్కోసారి పిరికితనం ఆవహిస్తోంది. ఎప్పటికి అభివృద్ధి సాధిస్తామోననే ఆవేదన కలుగుతోంది’ అని వ్యాఖ్యానించారు.
ఒక ప్రాంతంలో అతివృష్టి, మరో ప్రాంతంలో కరవు రెంటినీ సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. రాయలసీమలోని అనంతపురం కరవు జిల్లాల జాబితాలో దేశంలోనే రెండో స్థానంలో ఉందని, గత ఏడాది ఇన్‌పుట్ సబ్సిడీగా 650 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఈ ఏడాది 1750 కోట్లు అందిస్తామని వెల్లడించారు. ఎంతచేసినా ఆర్థిక సంస్కరణల ఫలాలు అందరికీ అందటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పేదరికమే కొలమానంగా అగ్రవర్ణ పేదలకు సైతం చేయూతనందిస్తున్నట్లు తెలిపారు. బిసిలకు కొంచెం కూడా అన్యాయం జరక్కుండా కాపులకు రిజర్వేషన్లు వర్తింప చేస్తామని ప్రకటించారు. ‘విజన్ ఉంది. రోడ్‌మ్యాప్ రూపొందించాం.కేంద్ర ప్రభుత్వమిచ్చే ప్యాకేజీకి చట్టబద్ధత ఇవ్వాలని చెప్పాం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేదిలేద’ని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రం తెలంగాణతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిని అవలంబిస్తామని విలేఖర్లడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాల్వల పరిధిలో ఆయకట్టును కాపాడేందుకు గోదావరి జలాలను తరలించే యోచనలో ఉన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లను కోల్పోయిన నేపథ్యంలో సాగర్ ఆయకట్టు సంరక్షణపై త్వరలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం గోదావరి నుంచి మూడువేల టిఎంసిల నీటితో పాటు అదనంగా మరో వెయ్యి టిఎంసిల నీటిని కలిపి సాగర్ ఆయకట్టులో సాగుకు నీరందించాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. అయితే ఈవిషయంలో ఖమ్మం, నల్గొండ జిల్లాల రైతులతో పేచీ తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తామన్నారు.