రాష్ట్రీయం

ఆషామాషీ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 6: కృష్ణాజిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం బాధాకరమని, బాధితులకు భరోసా ఇచ్చేందుకు వెళితే తనపై కేసులు పెట్టారని వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం విజయవాడలో విలేఖరులతో మాట్లాడుతూ బస్సులో రెండో డ్రైవర్ లేడని, అయితే డిక్కీలో పడుకున్నాడని అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. పోస్టుమార్టం చేయకుండా మృతదేహాలను తరలించే ప్రయత్నం చేశారని, నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయకపోతే జైలుకు వెళ్తారనడం తప్పా అని అడిగారు. టిడిపి ఎమ్మెల్యే జెసి ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ ఆయన గురించి మాట్లాడటం అనవసరమని అన్నారు. ఆయనకు మతిస్థిమితం ఉందో, లేదో తెలియదు. గజరాజు వెళ్తున్నప్పుడు కుక్కలు మొరగడం సహజమని వ్యాఖ్యానించారు. ఓ ముఖ్యమంత్రికి సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం చాలా పెద్ద విషయమని, సిఎం పదవిలో ఉన్న వ్యక్తులు ఆడియో, వీడియోలతో సహా దేశంలో ఎక్కడా దొరకలేదన్నారు. చంద్రబాబు మాత్రం అడ్డంగా దొరికిపోయినా పదవిలో కొనసాగుతున్నారన్నారు. ‘మనవాళ్లు బ్రీఫ్‌డ్ మీ’ అన్న వాయిస్ తనది కాదని చంద్రబాబు ఇప్పటికీ చెప్పలేదన్న విషయాన్ని వైఎస్ జగన్ గుర్తు చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం పూర్తికాగానే అరగంటలోనే మళ్లీ చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి గవర్నర్ చెప్పిన విషయాన్ని మళ్లీ చెప్పారన్నారు. మీడియాలో ఎక్కడ ఓటుకు కోట్లు విషయం వస్తుందేమో అన్న భయంతో చంద్రబాబు ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికి చాలా బాగా కష్టపడ్డారని ఎద్దేవా చేశారు. సరిగ్గా 11.06 నిమిషాలకు గవర్నర్ ప్రసంగం ప్రారంభమైతే 11.10 నిమిషాలకు చంద్రబాబు కేసును సుప్రీంకోర్టు విచారణకు చేపట్టిందన్నారు. కేసు అడ్మిట్ చేసుకుని నోటీసులు ఇచ్చిందన్నారు. అయితే చంద్రబాబు మాత్రం అవన్నీ మామూలే అంటున్నారని, పైగా తనపై 26 కేసులు పెట్టారని, అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించడం సిగ్గుచేటు అన్నారు.
రాజధానిలో ప్లాట్ల కేటాయింపు కుంభకోణంగా మారింది.. చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర మనుషులకు రోడ్ల పక్కన కూడళ్ళలో ప్లాట్లు దక్కాయి. రైతులకు మాత్రం ఎక్కడో మారుమూల ప్లాట్లు ఇచ్చారు. పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్రకు నాలుగువైపులా రోడ్లు, రెండు కమర్షియల్ జోన్ల మధ్య 12వేల గజాల ప్లాట్లు ఇచ్చారు. మంత్రి పల్లె రఘునాధరెడ్డి కుమరుడికి నేలపాడులో సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ప్రభుత్వ షాపింగ్ కాంప్లెక్స్‌ను ఆనుకుని ప్లాట్లు కేటాయించారు. స్పీకర్ పిఏకు వెలగపూడిలో సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ప్లాట్లు ఇచ్చారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే కుమార్తెకు మందడంలో ఇరువైపులా రోడ్లు ఉన్నా ప్లాట్లు కేటాయించారు. అసలు లాటరీ పద్ధతిలో పారదర్శకత ఉందా? అని ఆయన ప్రశ్నించారు. రైతుల భూములను అగ్రిజోన్‌లో పెట్టారు. తనవాళ్ల భూములను మాత్రం రియల్ జోన్‌లోకి వచ్చేలా చేశారు. మూడేళ్లయినా రాజధానిలో ఒక్కటి కూడా శాశ్వత నిర్మాణం జరగలేదు. అన్ని నిర్మాణాలు తాత్కాలికమే. బయట చదరపు అడుగుకు 1500 రూపాయలకు పనులు చేస్తే సచివాలయం, అసెంబ్లీకి రూ.10వేల చొప్పున ఖర్చు ఎలా చేస్తారంటూ జగన్ ప్రశ్నించారు. సభలోనే ప్రభుత్వానికి సమాధానం చెబుతామని జగన్ చెప్పారు.