రాష్ట్రీయం

కేటీఆర్‌తో పోల్చుకోను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 6: తనను తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో పోల్చుకోవడం లేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన అనంతరం సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కేటీఆర్ నాకంటే పదేళ్లు సీనియర్. ఆయనతో నేను ఎలా పోల్చుకుంటాను? ఒకవేళ మీరలా పోల్చుకుంటే మీ ఇష్టం’ అని ఓ ప్రశ్నకు జవాబుగా చెప్పారు. తనకిచ్చిన ఈ పదవిని బాధ్యతగానే భావిస్తున్నానన్నారు. నేరుగా ఎమ్మెల్యేగా కాకుండా ఎమ్మెల్సీగా పోటీ చేయడంపై వస్తున్న విమర్శలను ప్రస్తావించగా ‘నేను జగన్ మాదిరిగా మరొకరిని బలిచేసి పోటీ చేయమంటారా’ అని ప్రశ్నించారు. తాను 2012 నుంచే పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నానని, తనకు ఈ పదవి ఇచ్చినందుకు కార్యకర్తలు, నాయకత్వానికి శిరసువంచి నమస్కరిస్తున్నానని చెప్పారు.

చిత్రం..నామినేషన్ వేస్తున్న నారా లోకేష్