రాష్ట్రీయం

ఆడాళ్లూ.. మీకు జోహార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకుని వివిధ రంగాల్లో రాణించిన 24మంది మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున బుధవారం నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకల్లో వీరికి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున నగదు పురస్కారాన్ని అందజేయనున్నట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకటించింది.
విద్యా రంగంనుంచి కాకతీయ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ విద్యావతి (వరంగల్), సామాజిక సేవ రంగం నుంచి జానకీ (దివ్యాంగులకు పాఠశాల నిర్వహణ), తిరునగరి దేవకిదేవి (1969 తెలంగాణ ఉద్యమ నాయకురాలు- మహబూబ్‌నగర్), గాయత్రి (ప్రధానోపాధ్యాయురాలిగా పని చేస్తున్న దివ్యాంగురాలు- వనపర్తి), కురమ లక్ష్మిబాయి (పోరాట యోధురాలు- ఆదిలాబాద్), వ్యవసాయ రంగం నుంచి దుద్దెడ సుగుణమ్మ (ఆధునాతన వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక దిగుబడి సాధించిన మహిళా రైతు- జనగామ), నాగమణి (ఆదర్శ మహిళా రైతు- నల్లగొండ), తెలంగాణ ఉద్యమం నుంచి ఎస్ మణెమ్మ (ఉద్యమంలో చురుకైన పాత్ర- ఉప్పల్), దాత్రిక స్వప్న (ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీలో బుల్లెట్ గాయం- హైదరాబాద్), మూల విజయరెడ్డి (ఉద్యమంలో చరుకైన పాత్ర- పెద్దపల్లి), వృత్తిలో ప్రతిభ కనబరిచిన రంగంనుంచి ప్రమీల (ప్రముఖ న్యాయవాది, ఉద్యమంలో కీలక భూమిక- మంచిర్యాల), సాహితీ రంగం నుంచి అనిశెట్టి రజిత (వరంగల్), షాహజాన్ (ఖమ్మం), నృత్యం నుంచి డాక్టర్ వనజ ఉదయ్ (తెలుగు విశ్వవిద్యాలయంలో నృత్య విభాగాధిపతి), చిత్రలేఖనంలో అంజినీరెడ్డి (జహీరాబాద్), సంగీతంలో పాయల్ కోటగ్రీకర్ (నిజామాబాద్), తెలంగాణ ఉద్యమ గీతాలాపనలో చైతన్య (నల్లగొండ), స్వర్ణ (కరీంనగర్), క్రీడారంగంలో ప్రియదర్శినీ (వెయిట్ లిఫ్టింగ్‌లో గోల్డ్ మెడల్- వరంగల్), జర్నలిజమ్ నుంచి మాడపాటి సత్యవతి (ఆకాశవాణి తొలి న్యూస్ రీడర్), కట్టా కవిత (ప్రింట్ మీడియా- నల్లగొండ), జి మల్లీశ్వరి (ఎలక్ట్రానిక్ మీడియా- వరంగల్), నగదురహిత లావాదేవీలు వంద శాతం సాధించిన గ్రామ ప్రజాప్రతినిధిగా ఎం పద్మ (సర్పంచ్- గొల్లపల్లి- కరీంనగర్ జిల్లా), కుంబాల లక్ష్మి (సర్పంచ్- ఇబ్రహీంబాద్, సిద్దిపేట జిల్లా)లు ఉన్నారు.
8న ‘మహిళా సెలవు’: సర్కారు ఉత్తర్వులు జారీ
ఈనెల ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 8న మహిళా ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మహిళా దినోత్సవం నిర్వాహణకు ఏర్పాట్లు చేశారు.