రాష్ట్రీయం

అభివృద్ధి బాధ్యత నాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: ‘అభివృద్ధి కార్యక్రమాలను మంజురు చేసే బాధ్యత నాది...వాటిని సక్రమంగా అమలు చేసి ప్రజలకు ఉపయోగపడేలా చేసే బాధ్యత మీది’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధికారులకు పిలుపునిచ్చారు. గజ్వేల్ నియోజకవర్గ అధివృద్ధిపై జనహితలో సోమవారం ముఖ్యమంత్రి విస్తృతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే లక్ష్య సాధనలో అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు. ‘మిషన్ భగీరథ ద్వారా గజ్వేల్ నియోజకవర్గానికి మంచినీళ్లు వస్తున్నాయి. ప్రతీ గ్రామానికి నీళ్లు అందుతున్నాయి. ఊరికి దూరంగా ఉన్న ఇళ్లకు కూడా నీరు అందాలి. ఇంటింటికి ప్రతీ రోజు నీటి సరఫరా జరగాలి. అన్ని గ్రామాలకు మెరుగైన విద్యుత్ సరఫరా కోసం సబ్ స్టేషన్లు నిర్మించాం, ట్రాన్స్‌ఫార్మర్ల ఇస్తున్నాం. ఇంకా విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించాలి. నియోజకవర్గంలో పవర్ డే నిర్వహించాలి. ప్రతీ ఇంటికి మరుగు దొడ్డి నిర్మించాలి. ప్రతీ గ్రామంలో స్మశాన వాటిక నిర్మించాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామంలో ప్రజలు 25 కమిటీలు వేసుకుని వారి గ్రామాన్ని వారే అభివృద్థి చేసుకుంటున్నారు. ఆ గ్రామంలో పర్యటించి వారి చూసి నేర్చుకోవాలి’ అన్నారు. ఏ గ్రామానికి ఆ గ్రామం ప్రణాళిక రూపొందించుకోవాలి. జనాభా 750 దాటిన గ్రామాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేస్తామన్నారు. ప్రతీ గ్రామంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామ స్థాయిలో తలెత్తే సమస్యలను ప్రజాప్రతినిధులు, అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కార మార్గాలను సూచిస్తూ ముఖ్యమంత్రి అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో మంత్రి హరీశ్‌రావు, ఎంపి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, జాయింట్ కలెక్టర్ హన్మంతరావు, సిఎంఓ అధికారులు స్మీతా సభర్వాల్, శాంతకుమారి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. జనహితలో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్