తెలంగాణ

తెలంగాణలో హైఅలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: పఠాన్ కోట్, పారిస్‌లో ఉగ్రదాడుల నేపథ్యంలో తెలంగాణలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. దేశంలో ఎక్కడైనా, ఎప్పుడైనా ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో తెలంగాణలోని ప్రధాన నగరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత మరింత పెంచారు. హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు, బస్సు స్టాండ్‌లలో పోలీసులను మోహరించారు. ఔటర్ రింగ్ రోడ్డు, ఐటి కారిడార్‌లలో వాహనాల తనిఖీ ముమ్మరం చేశారు. నగరంలోని సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, ఎగ్జిబిషన్ వద్ద భద్రతా దళాలను మోహరింపజేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. నగరంలో ఎలాంటి అనుమతులు లేకుండా డ్రోన్‌లు వినియోగించరాదని, డ్రోన్‌లను నిషేధించినట్టు నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులకు, గుర్తు తెలియని వస్తువులకు దూరంగా ఉండాలని సూచించారు. అనుమానితులు ఎవరైనా కనిపిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ మహేందర్‌రెడ్డి కోరారు.
ఇనార్బిట్ మాల్‌లో డెకాయ్ ఆపరేషన్
నగరంలోని ఇనార్బిట్ మాల్‌లో గురువారం రాత్రి పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. బ్యాగుల్లో రైఫిళ్లు, మేగజైన్లు, బుల్లెట్లు పెట్టి పోలీసులు మాల్‌లోకి పంపారు. భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ వీటిని గ్రహించకపోవడంతో ఇనార్బిట్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు.