రాష్ట్రీయం

మహిళలకూ పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7:తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ప్రాధాన్యత లేదన్న విమర్శలపై నష్ట నివారణకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. రాష్ట్ర మంత్రివర్గంలో మహిళలకు ప్రాతినిథ్యం లేకుండానే దాదాపు మూడేళ్లు గడిచిపోవడంపై వస్తున్న విమర్శలకు ఇక తెర దించాలని నిర్ణయించారు. మంత్రివర్గంలో స్థానం కల్పించకపోయినా కనీసం నామినేటెడ్ పదవులైనా ఇచ్చి, ఈ విమర్శలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వంలో మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిపాలనలో మహిళలకు భాగస్వామ్యం పెంచాలని నిర్ణయించినట్టు మంగళవారం ప్రకటించారు.
మహిళాభ్యుదయానికి కృషి చేసిన వారితోపాటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన మహిళలను గుర్తించి నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నట్టు తెలిపారు.
కార్పొరేషన్ చైర్‌పర్సన్లు, డైరెక్టర్లు వంటి నామినేటెడ్ పదవులకు మహిళలను ఎంపిక చేసేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీలో సభ్యులుగా నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత, శాసనసభ డిప్యూటీ చైర్మన్ పద్మా దేవేందర్‌రెడ్డి, కరీంనగర్ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమలను నియమించారు. అర్హులైన మహిళలను ఎంపిక చేసి జాబితా పంపించాల్సిందిగా కమిటీని సిఎం ఆదేశించారు. ఈ కమిటీ చేసే సిఫారసుల మేరకు త్వరలోనే మహిళలకు పదవులు ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.