రాష్ట్రీయం

ముదిరిన ముసలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: తెలంగాణ జెఎసిలో ఆరంభమైన ముసలం ముదిరి ఇద్దరు నేతల సస్పెన్షన్‌కు దారి తీసింది. టి.జెఎసి రాష్ట్ర కన్వీనర్ పిట్టల రవీందర్, కో-చైర్మన్ నల్లపు ప్రహ్లాద్‌లను సస్పెండ్ చేస్తూ మంగళవారం జరిగిన టి.జెఎసి సమావేశం తీర్మానించింది. ప్రొఫెసర్ కోదండరామ్ వ్యవహార శైలిని తప్పుపడుతూ రవీందర్, ప్రహ్లాద్ మీడియాకు బహిరంగ లేఖలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. టి.జెఎసిని యధావిధిగా కొనసాగిస్తారా? లేక రాజకీయ పార్టీగా మారుస్తారా? అనే ప్రశ్నలనూ వారు ఆ లేఖల్లో సంధించారు. వీరి విమర్శలు శ్రుతి మించుతున్నాయని భావించిన కోదండరామ్ మంగళవారం అత్యవసరంగా జెఎసి సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించారు. రవీందర్, ప్రహ్లాద్‌లపై చర్య తీసుకునే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా చివరకు మెజారిటీ సభ్యుల అభిప్రాయం మేరకు వారిరువురిపైనా సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ప్రలోభాలకు లోనై విమర్శలు చేస్తున్నారన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. రవీందర్, ప్రహ్లాద్‌లు గుప్పిస్తున్న విమర్శల వల్ల జెఎసికి కలిగే ఇబ్బంది ఏమీ లేదని సమావేశంలో పలువురు ప్రతినిధులు అన్నారు. ప్రభుత్వ ఎత్తుగడను ప్రజల్లో ఎండగడుతూ మరింత ముందుకు వెళ్ళేందుకు దోహదపడుతుందని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కరించే బదులు ఆ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న వారిని అణచివేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోంని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే శక్తులు లేకుండా చేయాలన్న కుట్రలో భాగంగా టి.జెఎసిలో కొంత మందిని ప్రలోభ పరిచి గందరగోళం సృష్టించడానికి చేస్తున్న కుట్రను తిప్పికొట్టాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. విద్యర్థుల ఫీజుల నియంత్రణ వంటి ప్రజా సమస్యలపై త్వరలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
మా గొంతు నొక్కుతారా?
తనను సస్పెండ్ చేయడంపై నల్లపు ప్రహ్లాద్ మంగళవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ సస్పెన్షన్ అర్థరహితమన్నారు. జెఎసి రాజకీయ పార్టీ కాదని, పలు సంఘాల కలయిక అని చెప్పారు. జెఎసిలో సభ్యత్వ నమోదు లేనప్పుడు ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. తాము అడిగిన ప్రశ్నలకు జవా బు చెప్పకుండా సస్పెన్షన్ చేయడం ఏమిటన్నారు. భవిష్యత్తు కార్యక్రమాన్ని బుధవారం ప్రకటిస్తామని ఆయన చెప్పారు.

చిత్రాలు.. పిట్టల రవీందర్* నల్లపు ప్రహ్లాద్