రాష్ట్రీయం

ఎంబిసీలకు కార్పొరేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 9: అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబిసి) వారి సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటు పరిశీలనలో ఉందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. నిరుద్యోగ భృతి చెల్లింపు విధానంపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఆయన తన చాంబర్‌లో మీడియాతో గురువారం మాట్లాడారు. బిసిల్లో 132 కులాలు ఎక్కువగా లబ్ధి పొందాయని, కానీ చాలా కులాలు ఇంకా ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వారి సంక్షేమం కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసే అలోచన ఉందన్నారు. నిరుద్యోగ భృతి చెల్లింపునకు సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, కానీ ఏ విధంగా చెల్లించాలన్న అంశంపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో, 4, 5 దేశాల్లో దీనిని అమలు చేస్తున్నారన్నారు. ఇజ్రాయేల్‌లో నిరుద్యోగ భృతి చెల్లింపునకు, సామాజికపరంగా వారు చేసే సేవలను పరిగణనలోకి తీసుకుని చెల్లిస్తారన్నారు. ఇటీవల జరిగిన పారిశ్రామిక సదస్సుల్లో దాదాపు 50 శాతం మేరకు కార్యరూపం దాలుస్తున్నాయని తెలిపారు. దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రభుత్వ రంగంలో ఇప్పటికే దాదాపు 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. మధ్య, చిన్న తరహా, సూక్ష్మస్థాయి పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ) అనేకం మూత పడుతున్నాయన్నారు. వీటిని ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ 1.34 లక్షల కోట్ల కన్నా ఎక్కువ ఉంటుందని తెలిపారు. వ్యవసాయం, నీటి పారుదల, రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. పోలవరం పనులు ఆగకుండా ముందుగా రాష్ట్ర ప్రభుత్వమే అవసరమైతే నిధులు సమకూరుస్తుందన్నారు. తాను తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రెవెన్యూలోటు 16 వేల కోట్ల రూపాయలుగా తాము చెబుతుండగా, కేంద్రం 8 వేల కోట్ల రూపాయలుగా చెబుతోందన్నారు. ఇప్పటికే 4 వేల కోట్ల రూపాయలు విడుదల చేసిందన్నారు. మిగిలిన మొత్తం మార్చి మాసాంతానికి విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు. ఎఫ్‌ఆర్‌బిఎం శాతాన్ని మరో అర శాతం పెంచాలని కోరుతున్నామని, దీనివల్ల మార్కెట్‌లో రుణాలు ఎక్కువ మొత్తంలో తెచ్చుకునే వీలు కలుగుతుందన్నారు. నోట్ల రద్దు వల్ల గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ 6.1 శాతం మేర ఆదాయం తగ్గిందన్నారు. అది కేవలం నోట్ల రద్దు వల్ల మాత్రమేనని చెప్పలేమన్నారు. స్టాంప్స్, రిజిస్ట్రేషన్‌ల ద్వారా ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. రెవెన్యూ లోటు 27 వేల కోట్ల రూపాయల మేర ఉందన్నారు. జిఎస్‌టి అమలు వల్ల రాష్ట్రాలకు పన్ను విధించే అధికారం కోల్పోతుందని అంగీకరిస్తూ, దేశ అవసరాల దృష్ట్యా అంగీకరించామని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. అధిక ఆదాయం తెచ్చే పంటల వైపు రైతుల దృష్టి మళ్లడంవల్ల వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వృద్ధి రేటులో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఫిషరీస్, అక్వా, తదితర రంగాల్లో వృద్ధి ఎక్కువగా ఉందన్నారు.