రాష్ట్రీయం

పోలింగ్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: ఆంధ్రప్రదేశ్‌లో ఐదు శాసనమండలి (పట్ట్భద్రులు, ఉపాధ్యాయ) నియోజకవర్గాలకు గురువారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉత్తరాంధ్రలో విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో పట్ట్భద్రుల నియోజకవర్గానికి జరిగిన 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. విజయనగరం, విశాఖపట్నంలో 71.1 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 73 శాతం పోలింగ్ నమోదైంది. ఉత్తరాంధ్ర పట్ట్భద్రుల నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఇంత భారీ ఓటింగ్ గతంలో ఎప్పుడూ నమోదు కాలేదు. ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు ఓటు వేయకపోవడం గమనార్హం. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు ఎన్నికలు సాఫీగా జరిగాయి. నెల్లూరు జిల్లాలో పట్ట్భద్రుల స్థానానికి 64.94 శాతం, ఉపాధ్యాయ
నియోజకవర్గానికి 87.10 శాతం ఓటింగ్ నమోదైంది. ప్రకాశం జిల్లాలో పట్ట్భద్రుల నియోజకవర్గానికి 71.43 శాతం, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 91.97 శాతం ఓట్లు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో పట్ట్భద్రుల నియోజకవర్గానికి 65.16 శాతం, ఉపాధ్యాయుల నియోజకవర్గానికి 82.80 శాతం పోలింగ్ నమోదైంది. రాయలసీమలో అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల పశ్చిమ రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కోలాహలంగా ముగిశాయి. మూడు జిల్లాల్లో సగటున ఉపాధ్యాయ నియోజకవర్గంలో 93.26 శాతం, పట్ట్భద్రులనియోజకవర్గానికి 63.25 శాతం ఓట్లు పోలయ్యాయి. కర్నూలులో ఎంపి టిజి వెంకటేష్, నంద్యాలలో ఎంపి ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

చిత్రం.. శ్రీకాకుళంలోని పోలింగ్ కేంద్రం 47 వద్ద బారులు తీరిన పట్ట్భద్రుల ఓటర్లు