రాష్ట్రీయం

ఫెయిలైతే అంతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: రానున్న రోజుల్లో పదో తరగతి లోనే కాదు, ఐదు, ఎనిమిది తరగతుల్లోనూ విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షల్లో ఉత్తీర్ణులు కావలసి ఉంటుంది. లేనిపక్షంలో మళ్లీ అదే తరగతి చదవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన చట్ట సవరణలకు కేంద్రం సిద్ధం అవుతోంది. నో డిటెన్షన్ పద్ధతి కొనసాగించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఇటీవల కేంద్రం అన్ని రాష్ట్రాల విద్యాశాఖా మంత్రులతో సమావేశాలను నిర్వహించింది. ఈ సమావేశాల్లో వివిధ రాష్ట్రాలు భిన్నంగా స్పందించాయి. చాలా రాష్ట్రాలు డిటెన్షన్ ఉండాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మాత్రం నో డిటెన్షన్ విధానం కొనసాగాలని పేర్కొన్నాయి. తాజాగా విద్యాహక్కు చట్టం -2009లో సెక్షన్ 16ను సవరించాలని కేంద్రం తలపోస్తోంది. 2012 జూన్ 6న సెంట్రల్ ఎడ్వయిజరీ బోర్డు ఆఫ్ ఎడ్యుకేషన్ 59వ సమావేశం జరిగినపుడు సిసిఇ అమలుచేయాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఒక సబ్ కమిటీని కూడా నియమించారు. ఈ సబ్ కమిటీ 2014 ఆగస్టులో నివేదిక ఇచ్చింది. దీనిపై 2015 ఆగస్టు 19న జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చ జరిగింది. 23 రాష్ట్రాలు డిటెన్షన్ విధానం ఉండాలని పేర్కొనగా, ఐదు రాష్ట్రాలు మాత్రం నో డిటెన్షన్ కొనసాగించాలని చెప్పాయి. 2016 ఆగస్టు 19న జరిగిన సమావేశంలో రాజస్థాన్ విద్యామంత్రి ప్రొఫెసర్ వాసుదేవ దేవనాని అధ్యక్షతన సబ్ కమిటీని నియమించారు. ఈ కమిటీ పలు సూచనలను చేసింది. అందులో ప్రధానంగా ఐదో తరగతిలోనే పిల్లలకు పరీక్ష నిర్వహించాలని, ఈ పరీక్షను ఏ స్థాయిలో నిర్వహించాలనే అధికారం ఆయా రాష్ట్రాలకు విడిచి పెట్టాలని, రాష్ట్ర బోర్డు, జిల్లా బోర్డు, లేదా పాఠశాల స్థాయిలో దీనిని నిర్వహించి ప్రతిభను గణించాలని, విద్యార్ధులు ఫెయిల్ అయితే వారికి ప్రత్యామ్నాయ పాఠశాలల్లో చేర్చి శిక్షణ ఇచ్చి మళ్లీ పరీక్ష నిర్వహించాలని, ఉత్తీర్ణులైతే ఆరో తరగతికి అప్‌గ్రేడ్ చేయాలని, లేకుంటే ఐదో తరగతిలో కొనసాగించాలని సిఫార్సు చేసింది. ఆరు, ఏడు తరగతులలో మాత్రం పాఠశాల స్థాయి పరీక్షలు నిర్వహించి, 8వ తరగతిలో మళ్లీ విద్యార్ధి కౌశలాన్ని పరిశీలించాలని సూచించింది. అక్కడా ఫెయిల్ అయితే మరోసారి పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వాలని రెండోసారి కూడా ఫెయిల్ అయితే 8లోనే కొనసాగించాలని సబ్ కమిటీ సూచించింది. ఈసిఫార్సులను నిశితంగా పరిశీలించిన కేంద్రం ఈమేరకు చట్ట సవరణలను చేయాలని చూస్తోంది. కేంద్రం తెచ్చే కొత్త సవరణలను అన్ని రాష్ట్రాలు పాటించాల్సి ఉంటుంది.