రాష్ట్రీయం

హౌరా-ఎర్నాకులం, ఎగ్మోర్-హౌరా మధ్య ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 7: అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే చెన్నై ఎగ్మోర్-హౌరా, హౌరా-ఎర్నాకులం మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 8న నెం.06163 చెన్నై ఎగ్మోర్-హౌరా సూపర్‌ఫాస్ట్ ప్రత్యేక రైలు బయలుదేరుతుందని తెలిపింది. అలాగే హౌరా-ఎర్నాకులం-హౌరా మధ్య నెం.02853/02854 రైళ్లు ఈ నెల 9, 16 తేదీల్లో, తిరుగు ప్రయాణంలో 19, 19 తేదీల్లో నడుపుతున్నట్లు రైల్వే వెల్లడించింది.
పలు రైళ్లు రద్దు
సెంట్రల్ రైల్వే పరిధిలోని బైకుల్లా-ముంబయి సిఎస్‌టి మధ్య హాన్‌కాక్ రోడ్ ఓవర్ బ్రిడ్జి పనుల కారణంగా ఈ నెల 8 నుంచి 10 వరకు పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే తెలిపింది. నాగర్‌కోయిల్-ముంబయి సిఎస్‌టి, చెన్నై-ముంబయి సిఎస్‌టి, భువనేశ్వర్-ముంబయి ఎక్స్‌ప్రెస్‌లను 8వ తేదీన రద్దు చేసినట్లు తెలిపింది. నాగపూర్-ముంబయి సిఎస్‌టి 9న, నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్, ముంబయి సిఎస్‌టి-నాగర్‌కోయిల్ ఎక్స్‌ప్రెస్, ముంబయి సిఎస్‌టి-చెన్నై ఎక్స్‌ప్రెస్, ముంబయి సిఎస్‌టి-్భవనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లను 10వ తేదీన రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
పౌరసరఫరాలో డిపిసి పునర్వ్యవస్థీకరణ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 7 : రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో ప్రథమ, ద్వితీయ శ్రేణి గెజిటెడ్ ఆఫీసర్ల ప్రమోషన్ల వ్యవహారంపై పరిశీలన చేసేందుకు డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటి (డిపిసి) ని పునర్వ్యవస్థీకరించారు. ఈ మేరకు ప్రభుత్వ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎపి సివిల్ సప్లైస్ కమిషనర్ మెంబర్-కన్వీనర్‌గా ఉంటారు. లీగల్ మెట్రాలజీ కంప్ట్రోలర్,కన్స్యూమర్ అఫైర్స్ ఎక్స్-అఫీషియో జాయింట్ సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రెండేళ్లపాటు పనిచేస్తుంది. కమిటి గడువు 2017 నవంబర్ 25 వరకు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగుల గడువు పొడిగింపు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 7 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారులు వివాదాల పరిష్కార కమిషన్ (ఎపి స్టేట్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసెల్ కమిషన్-ఎపిఎస్‌సిడిఆర్‌సి) హైదరాబాద్‌తో పాటు జిల్లా ఫోరంలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల గడువును పొడిగించారు. ఈ మేరకు కన్స్యూమర్ అఫైర్స్ ఎక్స్-అఫీషియో సెక్రటరీ జి. జయలక్ష్మి పేరుతో గురువారం జీఓ జారీ అయింది. ఈ ఉద్యోగుల గడువును 2015 అక్టోబర్ 1 నుండి 2016 ఫిబ్రవరి 29 వరకు ఉంటుందని పేర్కొన్నారు.
మహిళా కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా
బాధ్యతలు స్వీకరించిన
పంచుమర్తి అనూరాధ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 7: ఆంధ్రప్రదేశ్ మహిళా కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా పంచుమర్తి అనురాధ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని మహిళలకు పార్టీ, ప్రభుత్వం మరింత చేరువయ్యేలా కృషి చేస్తానని ఆమె తెలిపారు. మహళా సాధికారత కేవలం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, వారి అభ్యున్నతి కోసం తెలుగుదేశం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని ఆమె తెలిపారు.