రాష్ట్రీయం

నేటినుంచి అసెంబ్లీ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక శాసన సభలో బడ్జెట్ ప్రతిపాదనలు ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. అనంతరం సభ వాయిదా పడ్డాక స్పీకర్ చాంబర్‌లో బిజినెస్ అడ్వయిజరీ (బిఎసి) సమావేశం జరుగుతుంది. సమావేశాలను ఎన్ని రోజులు కొనసాగించాలనేది బిఎసిలో శాసనసభపక్ష నాయకులతో చర్చించి స్పీకర్ ఖరారు చేయనున్నారు. అయితే సభలో బడ్జెట్ ఏ రోజు ప్రవేశ పెట్టాలన్నది పాలకపక్షం నిర్ణయం. ఈ నెల 13న ఉభయ సభలలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని పాలక్షపక్షం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నెల 29న ఉగాది పండుగ కావడంతో అంతకుముందు రోజు 28 వరకు బడ్జెట్ సమావేశాలను కొనసాగించాలని పాలకపక్షం నిర్ణయించినట్టు సమాచారం. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై శీతాకాల సమావేశాలలోనే సమగ్రంగా చర్చించిన విషయం తెలిసిందే. దీంతో బడ్జెట్ సమావేశాలను ఎక్కువ రోజులు నిర్వహించకుండా 16 పని దినాలు నిర్వహిస్తే సరిపోతుందని భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటివరకు వరుసగా మూడుసార్లు మిగులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగవసారి కూడా మిగులు బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నట్టు సమాచారం. టిఆర్‌ఎస్, కాంగ్రెస్ శాసనసభాపక్షాలు ఇప్పటికే సమావేశమై, సమావేశాల్లో అనుసరించవలసిన విధానంపై వ్యూహ రచన చేశాయి. టిటిడిపికి చెందిన సభ్యులు రాజ్‌భవన్‌కు వెళ్లి సభా నిర్వహణపై గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించగా, బిజెపి శాసనసభ పక్షం బుధవారమై సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేసింది.