రాష్ట్రీయం

పోలింగ్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కారణంగా గురువారం జరిగిన తెలంగాణ శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గం పోలింగ్ రద్దయింది. బ్యాలెట్ పేపర్లో ఇద్దరు అభ్యర్థుల ఫొటోలు తారుమారు కావడంతో పోలింగ్‌ను రద్దు చేయక తప్పలేదు. అయితే పొరపాటును ఉదయం 9 గంటలకే గుర్తించినా, ఈ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి చేరవేసి, అక్కడినుంచి ఎన్నిక రద్దు ఆదేశం వచ్చేసరికి పోలింగ్ తుది దశకు చేరింది. ఈ ఎన్నికను ఈనెల 19న నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. ఈ పొరబాటుకు బాధ్యుల్ని చేస్తూ చంచల్‌గూడ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. బ్యాలెట్ పేపర్ వరుస నెంబర్ 3లో ఉన్న అభ్యర్థి లక్ష్మయ్య పేరు పక్కన మాణిక్‌రెడ్డి ఫొటోను, వరుస క్రమం తొమ్మిదిలో మాణిక్‌రెడ్డి పేరు పక్కన లక్ష్మయ్య ఫొటోను ముద్రించారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కొందరు ఓటర్లు ఈ తప్పిదాన్ని గమనించి, పోలింగ్ ఏజెంట్ల దృష్టికి తీసుకొచ్చారు. ఇదే విషయాన్ని కొందరు యుటిఎఫ్ టీచర్లు, ఓటర్లు విషయాన్ని నేరుగా అభ్యర్థి మాణిక్‌రెడ్డికి చేరవేశారు. దీంతో ఆయన హయత్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హైస్కూల్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో యుటిఎఫ్ ప్రతినిధులు అక్కడకు చేరుకుని రీ పోలింగ్ నిర్వహించాలని నినాదాలు చేయటంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల అధికారులు బయటకు వచ్చి ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే పోలింగ్ నిర్వహిస్తున్నామని, ఆపేయమని తిరిగి ఆదేశాలొచ్చే వరకు పోలింగ్ కొనసాగుతుందని తేల్చి చెప్పారు. కాగా పోలింగ్ రద్దు చేయాలని మాణిక్‌రెడ్డి బృందం
ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు వినతిపత్రం సమర్పించారు. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉండగా ఐదు గంటల సమయానికి 50 శాతం పోలింగ్ నమోదైంది. మరో పది నిమిషాలకు పోలింగ్‌ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
ఇద్దరి సస్పెన్షన్?
ఫోటోల తారుమారు వ్యవహారంపై విచారణకు ఆదేశించామని ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. కాగా బ్యాలెట్ పేపర్‌లో అభ్యర్థుల పోటోలు తారుమారు వ్యవహారానికి సంబంధించి చంచల్‌గూడలోని ప్రభుత్వ ప్రింటింగ్ ప్రెస్‌లో షిఫ్టు ఇంఛార్జి, ప్రింటింగ్ ఆఫీసర్లపై సస్పెన్షన్ వేటు వేసి, వారి పైస్థాయి అధికారికి ఛార్జీ మెమో జారీ చేసినట్లు తెలిసింది. మరో ముగ్గురు జిహెచ్‌ఎంసి అధికారులపై కూడా వేటు వేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. లైజెనింగ్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్న అదనపు కమిషనర్ రమేష్, పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న ఎస్టేట్ ఆఫీసర్ సూర్యకుమార్, అదనపు ఎస్టేట్ ఆఫీసర్ రవీందర్‌రెడ్డిలకు చార్జి మెమోలు జారీ చేశారు.

చిత్రం.. హైదరాబాద్‌లోని విఎం హోం పోలింగ్ కేంద్రం వద్ద వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్సీ అభ్యర్థుల అనుచరులు