రాష్ట్రీయం

ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాపై పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 10: ఆర్టీసీ బలోపేతానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ, ప్రైవేటు ట్రావెల్స్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధం కావాలని శుక్రవారం నాడిక్కడ జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ప్రైవేటు ట్రావెల్స్ మాఫియా వ్యతిరేక పోరాట సమితి, జనచైతన్య వేదిక సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆర్టీసి, ఆర్టీఎ మాజీ అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ డి.సుధాకర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రైవేటు ట్రావెల్స్ నిబంధనలకు వ్యతిరేకంగా నడుస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని, ప్రభు త్వ విధానాలపై తిరగబడేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ప్రజాస్వామ్యం పేరుతో అధికారంలో ఉన్న పార్టీలు చట్టాలను, తమ చుట్టాలుగా మార్చుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రైవేటీకరణ మోజులో పడుతున్నాయని ఆరోపించారు. ప్రైవేటు ట్రావెల్స్‌ను ప్రోత్సహిం చాలన్న ఆలోచనను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. తెరాస ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడు తూ, ప్రజా రవాణా వ్యవస్థను పర్య వేక్షించడమే కాకుండా దానిని పరిరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా నడిచే ప్రైవేటు బస్సులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతై నా ఉందన్నారు. పిసిసి అధికార ప్రతినిధి గౌతం మాట్లాడుతూ, పెనుగం చిప్రోలు ఘటనకు బాధ్యులుగా జెసి. దివాకర్‌రెడ్డి, ఆయన సోదరుడు జెసి.ప్రభాకర్‌రెడ్డిలను అరెస్టు చేసి ప్రభుత్వం నిజాయితీని నిరూపించుకోవాలని సూచించారు. జనచైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసిని మరింత అభివృద్ధి చేసి ప్రైవేటు ట్రావెల్స్‌ను పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సభ కు అధ్యక్ష వహించిన సుధాకర్ మాట్లాడుతూ, కోట్ల రూపాయలు నష్టం కలిగిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై రెండు రాష్ట్రాలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.