రాష్ట్రీయం

రాజస్థాన్ జలస్వావలంబన్‌లో సంస్థాన్ వాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్థాన్‌నారాయణపురం, మార్చి 10: రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలస్వాలంబన్ పథకాన్ని విజయవంతం చేసిన వెదిరె శ్రీరాం బృందంలో యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రానికి చెందిన జక్కిడి జంగారెడ్డి ఉండటం విశేషం. కిలోమీటర్ల కొద్దీ వెళ్లినా చుక్కనీరు లేని రాజస్థాన్‌లోని సర్వన్, బాన్స్‌వాడ, గోడీతేజ్‌పూర్ లాంటి ప్రాంతాల్లో జలవనరుల పునరుద్ధణ కోసం రాజస్థాన్ ప్రభుత్వం నదీపరివాహక ప్రాంత మండలిని ఏర్పాటు చేసింది. దీనికి అధ్యక్షుడిగా నల్లగొం డ జిల్లాకు చెందిన వెదిరె శ్రీరాం, మరో నలుగురు సభ్యులను (వీరంతా తెలుగువారే) నియమించింది. తెలంగాణ గ్రామీణాభివృద్ధిశాఖతో పాటు వాటర్‌షెడ్ పథకాల్లో 15 ఏళ్ల అనుభవం గడించిన జక్కిడి జంగారెడ్డిని వెదిరె శ్రీరాం తన బృందంలో సభ్యునికి తీసుకున్నాడు. ఈ బృందం గత మూడు సంవత్సరాలుగా అక్కడ కొండల్లో, గుట్టల్లో, ఇసుక నేలల్లో తిరుగుతూ స్థానిక ప్రజలతో మమేకమైం ది. మొదట వీరిని వ్యతిరేకించిన ప్రజలు ఆ తర్వా త వీరితో కలసి జల సంరక్షణ పథకంలో వారంతా భాగస్వాముల య్యారు. ప్రతి నిత్యం సుమారు 500 నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించి పనులను పర్యవేక్షిస్తున్నట్లు జంగారెడ్డి తెలిపారు. చుక్కనీటికి కిలోమీటర్ల దూరం నడిచే ప్రజలకు తాము చేపట్టి న జలస్వాలంబన్‌తో ఎంతూ ఉపశమనం లభించిందని, ఇప్పుడు కేవలం 3 నుంచి 10 అడుగులు తవ్వితే నీరు లభిస్తోం దని, పలు చిన్న చెరువుల్లో నీరు లభిస్తుండడంతో అక్కడి రైతులు రెండుపంటలు పండించడానికి సిద్ధమయ్యారని తెలిపారు. ఎప్పుడూ వలసలు వెల్లే రైతన్నలు, కూలీలు ప్రస్తుతం అక్క డే ఉండి పంటలు పండించుకునే స్థితికి చేరు కున్నా రని తెలిపారు. తీవ్రమైన నీటి ఎద్దడి, ఫ్లోరిన్ సమస్యతో సతమతవౌతున్న మునుగోడు, దేవరకొండ నియోజకవర్గంలోని గుట్టలు, ప్రభు త్వ బంజరు, పోరంబోకు, అటవీ భూముల్లో కూడా ఇదే విధానాన్ని అమలుచేస్తే తాగు, నీటి ఇబ్బం దులు దూరం అవుతాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.