రాష్ట్రీయం

మావోల మెరుపు దాడి 12 మంది జవాన్ల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం/చింతూరు, మార్చి 11: చత్తీస్‌గఢ్‌లో మావోలు శనివారంనాడు మారణకాండ సృష్టించారు. మాటు వేసి జవాన్లను ఉచ్చులోకి దించి మట్టుబెట్టారు. ముందుగా మందుపాతర పేల్చి, తర్వాత చుట్టుముట్టి 12 మందిని కాల్చి చంపారు. 10 అత్యాధునికమైన ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలోని సుక్మా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్‌కు 2 కి.మీల దూరంలో బుందేపారా - కొత్తరాచేర్ అటవీ ప్రాంతంలో మాటు వేసి, దాడి చేసిన మావోలు సిఆర్పీఎఫ్ 219 బెటాలియన్‌కు చెందిన 12 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. చనిపోయిన వారిలో ఒక ఇన్‌స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలు, 8 మంది జవాన్లు ఉన్నారు. మరో ఇద్దరు రాజధాని రాయ్‌పూర్‌లో చికిత్స పొందుతున్నారు. జవాన్లు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, చత్తీస్‌గఢ్ సిఎం రమణ్‌సింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు మార్చి 11న మావోయిస్టులు ఇదే జిల్లాలో టహకవాడా ప్రాంతంలో ఒక పౌరుడు సహా 16 మంది పోలీసులను ఇదే తరహాలో హతమార్చడం గమనార్హం.
సుక్మా జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో రోజూ ఉదయం రోడ్ ఓపెన్ పార్టీలు రహదారిని తనిఖీ చేస్తుంటాయి. దానిలో భాగంగానే సుక్మా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ నుంచి ఆర్‌ఓపి బలగాలు సిఐ భట్ ఆధ్వర్యంలో శనివారం ఉదయం బయలుదేరాయి. బలగాలు వస్తాయని ముందుగానే రెక్కీ నిర్వహించి రూఢీ చేసుకున్న మావోయిస్టులు వ్యూహాత్మకంగా ఉచ్చు బిగించారు. మందుపాతర ఏర్పాటు చేసి, దానికి 900 మీటర్ల దూరంలో కాపు కాశారు. రోడ్డు తనిఖీ చేసుకుంటూ వచ్చిన బలగాలను లక్ష్యంగా చేసుకుని ముందుగా మందుపాతర పేల్చారు. కొద్దిసేపు దిగ్భ్రాంతికి గురైన బలగాలు చెల్లా చెదురయ్యాయి. ఇదే సమయంలో మూడు వైపుల నుంచి మావోయిస్టులు చుట్టుముట్టి బలగాలపై అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. దీంతో 11 మంది జవాన్లు అక్కడికక్కడే నేలకొరిగారు. మరో జవాను చికిత్స పొందుతూ చనిపోయాడు. చనిపోయిన వారిలో ఇన్‌స్పెపెక్టర్ హెచ్‌వి భట్ (ఉత్తరాఖండ్), ఎస్సైలు నరేంద్రకుమార్ (బీహార్), మంగేశ్‌పాండ్యా (మహారాష్ట్ర), జవాన్లు రాంపాల్ సింగ్ యాదవ్ (ఉత్తరప్రదేశ్), గోరఖ్‌నాథ్ (ఉత్తరప్రదేశ్), నంద్‌కుమార్ ఆతారాం (మహారాష్ట్ర), సతీశ్ చంద్ర వర్మ (ఉత్తరప్రదేశ్), కె.శంకర్ (తమిళనాడు), జగజ్జిత్‌సింగ్ ( పంజాబ్), సురేశ్‌కుమార్ (హిమాచల్‌ప్రదేశ్), విఆర్ మేలేవర్థన్ (మహారాష్ట్ర), జగదీశ్ ప్రసాద్ వైష్ణవ్ (రాజస్థాన్)లు ఉన్నారు. కాగా సిఆర్‌పిఎఫ్ జవాన్లు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.
తెలంగాణ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు ముమ్మరంగా ఉన్నట్లు ఇరు రాష్ట్రాల పోలీసులు, నిఘా వర్గాలు ముందుగానే ఊహించాయి. రెండు వారాలుగా ఇరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు నిత్యం సమావేశం అవుతూనే ఉన్నారు. అలాగే మావోయిస్టులు సైతం బలగాలకు సవాల్ విసిరినట్లుగానే సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. అయినా ప్రమాదాన్ని బలగాలు పసిగట్టలేక పోయాయి. మావోయిస్టులు పన్నిన వ్యూహంలో చిక్కుకుని సిఆర్‌పిఎఫ్ జవాన్లు బలయ్యారు. మూడేళ్లుగా ఎన్నడూ లేనంత విధంగా భద్రత బలగాలు దెబ్బతినడంతో ఫ్రభుత్వం అంతర్మథనంలో పడింది.