రాష్ట్రీయం

నేడే బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12:తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగో వార్షిక బడ్జెట్‌ను టిఆర్‌ఎస్ ప్రభుత్వం సోమవారం ఉదయం శాసనసభలో ప్రవేశ పెట్టబోతోంది. ప్రస్తుత వార్షిక బడ్జెట్ 1,30,412 కోట్లు కాగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి 1,46,500 కోట్ల ప్రతిపాదనతో ప్రవేశ పెట్టనున్నట్టు సమాచారం. గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా రూ. 11 వేల కోట్లు సమకూరుతాయని అంచనా వేయగా ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేకపోయింది. దీనికి తోడు పెద్ద నోట్ల రద్దు ప్రభావం వల్ల రవాణాశాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖల నుంచి ఆశించిన ఆదాయం కంటే రూ. 4 నుంచి 5 వేల కోట్లు తగ్గిందని అంచనా. దీంతో భూముల అమ్మకం, పెద్ద నోట్ల ప్రభావంతో 2016-17 బడ్జెట్ ప్రతిపాదనను సవరించడం వల్ల లక్షా 15 వేల కోట్లు ఉంటుందని ఆర్థికశాఖ వర్గాల సమాచారం. ఇలాఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014-15లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ.62,306 కోట్లు, 2015-16లో రూ.లక్ష 15 వేల కోట్లు, 2016-17లో రూ.లక్ష 30 వేల 412 కోట్లు కాగా ఇది వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ప్రతిపాదన రూ. లక్ష 46 వేల కోట్లు ఉంటుందని అంచనా.
కేంద్ర మార్గదర్శకాల మేరకు ఈ ఏడాది బడ్జెట్ స్వరూపం మారింది. గతంలో ఉండే ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల స్థానంలో ఈసారి బడ్జెట్‌లో ప్రగతి పద్దు, నిర్వహణ పద్దుగా ఉండబోతున్నాయి. ఈ రెండు పద్దులతో సంబంధం లేకుండా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్‌కు ప్రత్యేక అభివృద్ధి నిధి కింద నిధుల కేటాయింపు ఉంటుందని తెలిసింది. ఈసారి బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి మొదటి ప్రాధాన్యత, విద్య, వైద్య రంగాలకు రెండవ ప్రాధాన్యత, వ్యవసాయం, సాగునీటి రంగాలకు మూడవ ప్రాధాన్యత కల్పించినట్టు సమాచారం. రైతుల పంట రుణ మాఫీ నాలుగవ వాయిదాకు రూ.4200 కోట్లు, ఉద్యోగుల ఫిట్‌మెంట్ బకాయిల చెల్లింపునకు రూ. 5000 కోట్లు, రాజీవ్ గృహకల్ప బకాయిల మాఫీకి రూ.3300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినట్టు సమాచారం. అలాగే అన్ని జిల్లాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి రూ.1500 కోట్లు కేటాయించినట్టు తెలిసింది. ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాలుగవసారి ప్రవేశ పెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనకు ఆదివారం సాయంత్రం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. అలాగే సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి 12.06 గంటలుగా మంత్రిమండలి ముహుర్తం ఖరారు చేసింది. శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారని తెలిసింది.