రాష్ట్రీయం

భూమా మృతి ఏపికి తీరని లోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: నంద్యాల శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతి పట్ల వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఆంధ్రప్రదేశ్‌కు తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. కాగా, తన సన్నిహితుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజారాజ్యం పార్టీలో కలిసి పని చేసినప్పుడు ఆయన నాయకత్వ లక్షణాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని అన్నారు. భూమా మరణం ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యంగా కర్నూలు జిల్లాకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన భార్య శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించిన రెండున్నరేళ్లలోపే నాగిరెడ్డి కూడా మృతి చెందడం వారి కుటుంబానికి తీరని లోటని అన్నారు. ఈ సమయంలో వారి పిల్లలకు ఈ విపత్తును తట్టుకునే మనోధైర్యాన్ని ఇవ్వాలని, నాగిరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నట్టు పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు.
కెసిఆర్ సంతాపం
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నంద్యాల వెళ్లి భూమా నాగిరెడ్డి భౌతికకాయం వద్ద నివాళి అర్పించారు. మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి భూమానాగిరెడ్డికి మృతికి సంతాపం తెలిపారు. భూమా నాగిరెడ్డి తమకు మంచి మిత్రుడని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.