రాష్ట్రీయం

భూమాను కుంగదీసిన భార్య మృతి, కేసులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 12: తన భార్య భూమా శోభారాణి మరణం తరువాత మానసికంగా కుంగిపోయిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి (54) ఇక రాజకీయాల నుంచి విరమించుకోవాలన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయనతో అత్యంత సన్నిహితంగా ఉన్న బంధుమిత్రుల ద్వారా తెలుస్తోంది.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని తన నివాసంలో గుండెపోటుకు గురైన నాగిరెడ్డి నంద్యాలలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్దకు వచ్చిన ఆయన సన్నిహితులు ఆయన నిర్ణయంపై మాట్లాడుకున్నారు. శోభమ్మ మరణంతో మానసికంగా బలహీనుడిగా మారారని, దీనికి తోడు వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నమోదైన కేసులు, వివాదాలు వంటివి ఆయనను తీవ్ర ఆవేదనకు గురి చేశాయని చర్చించుకున్నారు. ఈ వేదనలో తనకేమైనా అయితే పిల్లల భవిష్యత్తు దెబ్బతింటుందన్న ఆలోచనతో మానసిక ప్రశాంతత కోసం రాజకీయాల నుంచి విరమించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న కుమార్తె 2019 ఎన్నికల నాటికి రాజకీయాల్లో స్థిరపడుతుందని, ఆ తరువాత కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డిని ఒక మంచి వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలన్న ఆలోచన నాగిరెడ్డికి ఉండేదని సన్నిహితులు వెల్లడించారు. ప్రస్తుత రాజకీయాలను కుమారుడు జగత్ జీర్ణించుకోలేడని, అతడి మనస్తత్వానికి వ్యాపారమే మేలన్న ఆలోచన నాగిరెడ్డి మదిలో ఉండేదని వెల్లడవుతోంది. భూమా నిర్ణయాన్ని ఆయన సన్నిహితులు సైతం స్వాగతించారని స్పష్టమవుతోంది. అయితే ఈ విషయం ఎక్కడా బయట పడకుండా వారు జాగ్రత్తపడ్డారు. భూమా నాగిరెడ్డికి గతంలో రెండు దఫాలు స్వల్ప గుండెపోటు వచ్చిందని ఆ తరువాత శోభమ్మ మరణంతో ఆయన తీవ్ర మనోవేదనలో ఉన్నట్లు తెలుస్తోంది. నంద్యాల ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలో పట్టణ ప్రజల కోరిక మేరకు రహదారుల విస్తరణకు ఆయన వైకాపా ఎమ్మెల్యేగా తీవ్రంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో పురపాలక సంఘం అధికారులపై సైతం ఒత్తిడి తీసుకువచ్చినా ప్రయోజనం లేకపోయింది. దీనికి తోడు ఒక పోలీసు అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించారని, పురపాలక సంఘం సమావేశంలో బెదిరింపులకు దిగారంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. పోలీసు అధికారిపై దురుసుగా ప్రవర్తించారన్న అభియోగంపై ఆయన జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఆ తరువాత ఆయన తీవ్రంగా ఆలోచించి వైకాపాలో ఉంటే ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోలేనని అంతేగాక మానసికంగా మరింత వేదనకు గురైతే ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో అధికార పార్టీలో చేరాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తరువాత కూడా ఆయన రహదారుల విస్తరణపైనే ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద ప్రస్తావించే వారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో నంద్యాల నుంచే కాకుండా ఎక్కడి నుంచి పోటీ చేసే ఆలోచన తనకు లేదని, అయితే నంద్యాల పట్టణంలో రహదారుల విస్తరణకు ఎవరూ అడ్డంకులు సృష్టించకుంటే ఎవరితోనూ విభేదాలు ఉండబోవని సిఎం చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రహదారుల విస్తరణకు ప్రత్యేక ప్రణాళిక రచించి అమలు చేయాలని అందుకు అవసరమైన నిధులు మంజూరు చేయడానికి సిఎం చంద్రబాబు అంగీకరించినట్లు తెలుస్తోంది. అలాగే నాగిరెడ్డి ఆలోచన బయట పెట్టకుండా శిల్పా సోదరులకు అన్యాయం జరగదని తనపై నమ్మకం ఉంచి పార్టీ కోసం పని చేయాలని రానున్న ఎన్నికల్లో టికెట్ ఇచ్చే బాధ్యత నాది అసి సిఎం చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారని వెల్లడవుతోంది. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరితే తన కూతురుకు రాజకీయంగా చేదోడుగా ఉంటూ కుమారుడిని వ్యాపారిగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశ్యంతో ఆయన ఇటీవల ప్రశాంతంగా ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడే వారని సన్నిహితులు వెల్లడిస్తున్నారు. ఈ సమయంలో ఆయన గుండెపోటుకు గురై మరణించడం అందరినీ కలచివేస్తోంది. కాగా సరిగ్గా మూడేళ్ల క్రితం తల్లిని, ఇప్పుడు తండ్రిని కోల్పోయిన భూమా కుమార్తెలు అఖిలప్రియ, వౌనిక, కుమారుడు జగత్‌విఖ్యాత్‌రెడ్డిలను ఓదార్చడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.