రాష్ట్రీయం

జల ఘోష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 13:అడుగంటుతున్న భూగర్భ జలాలతో ప్రజలకు వేసవి నీటి కష్టాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. గత ఏడాది నవంబర్‌తో పోలిస్తే సోమవారం నాటికి రాష్ట్రంలో సగటున 2.31 మీటర్ల మేర లోపలికి భూగర్భ జలాలు పడిపోయాయి. కోస్తా జిల్లాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉండగా, రాయలసీమ ప్రాంతంలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. గత ఏడాది సాధారణ వర్షపాతం కంటే 29 శాతం మేర తగ్గడంతో దాని ప్రభావం భూగర్భ జలాలపై స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో గత ఏడాది నవంబర్‌లో 5.14 మీటర్ల లోతున భూగర్భ జలాలు ఉండగా, ప్రస్తుతం 7.19 మీటర్లకు లోతుకు వెళ్లిపోయాయి. గత ఏడాది నవంబర్ నెలతో పోలిస్తే, విజయనగరంలో 2.37 మీటర్లు, విశాఖపట్నంలో 2.26 మీటర్లు, తూర్పు గోదావరిలో 2.29 మీటర్లు, పశ్చిమ గోదావరిలో 2.93 మీటర్లు, కృష్ణాలో 1.97 మీటర్లు, గుంటూరు జిల్లాలో 2.38 మీటర్లు, ప్రకాశం జిల్లాలో 1.27 మీటర్లు, నెల్లూరులో 0.36 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. చిత్తూరు జిల్లాలో 3.49 మీటర్లు, కడపలో 3.45, అనంతపురంలో 3.38, కర్నూలులో 1.88 మీటర్ల మేర లోతుకు వెళ్లిపోయాయి. రాష్ట్రంలో సగటున 2.31 మీటర్ల మేర లోతుకు వెళ్లడం గమనార్హం. వేసవి తీవ్రత పెరిగితే భూగర్భ జల మట్టం మరింత పడిపోయే ప్రమాదం లేకపోలేదు.