రాష్ట్రీయం

నీట్ - యుజి అభ్యర్థులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: వైద్య విద్యాసంస్థల్లో యుజి కోర్సులో చేరేందుకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశపరీక్ష (నీట్) నియమనిబంధనల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ప్రధానంగా వయస్సుకు సంబంధించి ఉన్న ఆంక్షలను సడలించనున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం 17 నుండి 24 ఏళ్లలోపు వారు మాత్రమే నీట్ రాసేందుకు అర్హులు, అలాగే ప్రతి అభ్యర్ధికి మూడు సార్లు మాత్రమే పరీక్ష రాసే అవకాశం కల్పించారు. అయితే అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారు కూడా నీట్ రాసేందుకు అవకాశం ఇవ్వాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యోచిస్తోంది. అలాగే గరిష్ట వయోపరిమితి కూడా సడలించే అవకాశం లేకపోలేదని ఎంసిఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 17న జరిగే ఎంసిఐ సమావేశంలో ఇందుకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అదే రోజు తెలుగు రాష్ట్రాల్లోని మెడికల్ కాలేజీల్లో యుజి సీట్లపై కూడా అవగాహన వస్తుందని చెబుతున్నారు. ఆంధ్రాలో ఆరు కాలేజీలకు 380 సీట్లు పెంచాల్సిందిగా ప్రతిపాదనలు పంపించారు. అలాగే తెలంగాణ నుండి 220 సీట్ల పెంపుదలకు ప్రతిపాదనలు వెళ్లాయి.