రాష్ట్రీయం

పెట్టుబడిదారుల బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రవేశెట్టిన బడ్జెట్ పేదల బడ్జెట్ కాదని, పెట్టుబడి దారుల బడ్జెట్ అని టిడిపి శాసనసభాపక్ష నాయకుడు ఎ. రేవంత్ రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ నుంచి సస్పెన్షన్‌కు గురైన రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సోమవారం మంత్రి ఈటల బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో అసెంబ్లీ గేట్ ఎదుట మండుటెండలో నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు మొండి చేయి చూపించారని, అసత్యాల బడ్జెట్‌ను ప్రవేశపెట్టారని విమర్శించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకునే విషయంలో పట్టించుకోలేదని అన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిల కోసం 4,300 కోట్ల రూపాయలు అవసరం కాగా బడ్జెట్‌లో 1900 కోట్ల రూపాయలను మాత్రమే కేటాయించిందని ఆయన తెలిపారు. గత మూడేళ్ళలో కేవలం 1400 డబుల్ బెడ్ రూం ఇండ్లను మాత్రమే నిర్మించినట్లు ప్రభుత్వమే ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. అటువంటప్పుడు రాబోయే రెండేళ్ళలో 2లక్షల 20వేల ఇండ్లను నిర్మించడం సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు.

చిత్రం..మండుటెండలో నిల్చొని
నిరసన తెలుపుతున్న టి. టిడిపి ఎమ్మెల్యేలు రేవంత్, సండ్ర