రాష్ట్రీయం

ఉపాధికి ఊతం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 14: ఆంధ్రప్రదేశ్ సొంతగడ్డపై నిర్మించిన అసెంబ్లీలో తొలి బడ్జెట్‌ను ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టబోతోంది. 2017-18 సంవత్సరానికి సంబంధించి దాదాపు 1.55 లక్షల కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్‌ను రూపొందించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఇది దాదాపు 19 వేల కోట్ల రూపాయలు ఎక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌ను ఈనెల 13న ప్రవేశపెట్టాల్సి ఉంది. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతి కారణంగా బుధవారానికి వాయిదా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్‌లో యువత, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. యువతకు ఉపాధి, నిరుద్యోగ భృతి అంశాలు బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయించనున్నారు. నిరుద్యోగ భృతికి దాదాపు 500 కోట్ల రూపాయలు కేటాయించనున్నారు. ఉపాధి కల్పనపై మరింత స్పష్టత ఇవ్వనున్నారు. జలవనరుల శాఖకు, గృహ నిర్మాణానికి, సంక్షేమానికి ఎక్కువగా నిధులు కేటాయించనున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో ఎక్కువ శాతం కేంద్ర నిధులపైనే ఆధారపడనుంది. కేంద్ర ప్రభుత్వ వాటాగా 43 శాతం కింద దాదాపు 65 వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి లభించనున్నాయి. పెద్ద నోట్ల రద్దు తరువాత కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే
ఆదాయం పెరగడంతో ఆ మేరకు ఆదనంగా కేటాయింపులు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 58 వేల కోట్ల రూపాయలు, రుణాల ద్వారా మరో 32 వేల కోట్ల రుపాయలను సమకూర్చుకోనుంది. తాజా అంచనాల ప్రకారం రెవెన్యూలోటు 6,642 కోట్ల రూపాయలు కాగా, ఆర్థిక లోటు 13,680 కోట్లకు చేరుకుంది. ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయానికి సంబంధించి పద్దులు లేకుండా, వాస్తవ ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని ఈ సారి బడ్జెట్‌ను ప్రతిపాదించనున్నారు. సాధారణ బడ్జెట్ అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను కూడా ప్రవేశపెట్టనున్నారు. దాదాపు 25 వేల రూపాయలు వ్యవసాయం, దాని అనుంబంధ పద్దులకు కేటాయించనున్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, శాసన మండలిలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ప్రవేశపెట్టనున్నారు. బుధవారం ఉదయం 11.25 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెడతారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీ, అధికారులకు బడ్జెట్ ప్రతులను ట్యాబ్‌లలో లోడ్ చేసి ఇవ్వనున్నారు. ఒక బ్యాగ్ కూడా ఇవ్వనున్నారు. ఈ-ప్రగతి సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ట్యాబ్‌లలో అందించేందుకు ఏర్పాట్లు చేశారు.