రాష్ట్రీయం

నా బాధ్యతలు నాకు తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 8: ‘నా బాధ్యతలేమిటో నాకెవరూ చెప్పక్కర్లేదు. కొంతమంది నేతలు జీవితాంతం రాజకీయాల్లో కొనసాగి, అధికారంలో ఉన్నప్పుడు ఈ డిమాండ్లు గుర్తులేక ఇప్పుడు నన్ను విమర్శించేందుకు వేదికలు వెతుక్కుంటున్నారు. కాపుల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడే ఉంది. అందులో సందేహం లేదు’ అని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాపుల రిజర్వేషన్లకు సంబంధించి జరుగుతున్న కార్యక్రమాలు, ఇతర ఆందోళనలను పరోక్షంగా ప్రస్తావిస్తూ నేతలను ఉద్దేశించి ఈవిధంగా వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురం గ్రామంలో శుక్రవారం జరిగిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. కాపుల సంక్షేమాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటికే వారి అభ్యున్నతికి కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. కేటాయించిన నిధులను అవసరమైతే మరింత పెంచుతామన్నారు. బీసీ వర్గాలకు ఎటువంటి ఇబ్బంది లేనివిధంగా కాపులను కూడా వెనుకబడిన వర్గాల్లో చేర్చే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దీనిపై ఇప్పటికే కమిషన్‌ను నియమించామని, నివేదిక రాగానే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తన బాధ్యతలేంటో ఎవరూ చెప్పాల్సిన పనిలేదని, తానే స్వయంగా చర్యలు తీసుకున్నానన్నారు. బీసీలు తెదేపాకు వెన్నుముక వంటివారని, వారికి ఎటువంటి నష్టం కలగకుండా కాపులను కూడా బీసీల జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్‌లను ఏర్పాటు చేశామన్నారు. ప.గో జిల్లాకు సంబంధించి భూముల అందుబాటు దారుణంగా ఉందని, భూముల లభ్యత లేకుంటే అభివృద్ధిలో ముందడుగు పడదన్నారు. అమరావతిలో 33వేల ఎకరాలను రైతులు పూలింగ్‌లో ఇచ్చారని, అలాగే జిల్లా రైతులూ కొంత త్యాగం చేస్తేనే అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నారు. పోలవరంపై కొందరు నేతలు అనవసరమైన విమర్శలు మానుకోవాలని, జిల్లా రైతును ఆదుకునేందుకు అవసరమైతే ఒడిశాతో మాట్లాడి అదనపు జలాలు రప్పిస్తానని హామీ ఇచ్చారు. 2018నాటికి పోలవరం మొదటి దశ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, పీతల సుజాత, పైడికొండల మాణిక్యాలరావు, ఎంపిలు తోట సీతారామలక్ష్మి, మాగంటి మురళీమోహన్, మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, విప్‌లు చింతమనేని ప్రభాకర్, అంగర రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... నల్లజర్ల మండలం జగన్నాథపురం జన్మభూమిలో మత్స్యశాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌లో చేపను పరిశీలిస్తున్న సిఎం చంద్రబాబు