రాష్ట్రీయం

స్థలాల క్రమబద్ధీకరణకు ఒకే జీవో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 14: రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న పేదల స్థలాల క్రమబద్ధీకరణకు సమగ్రమైన ఒకే జీవోను త్వరలో జారీ చేయాలని మంత్రుల బృందం నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) కెఇ కృష్ణమూర్తి అధ్యక్షతన మంత్రుల బృందం సమావేశం మంగళవారం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, సిసిఎల్‌ఎ అనిల్ చంద్ర పునేటా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జెసి శర్మ, లా సెక్రటరీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధీకరణ చేసేందుకు గతంలో 296, 118, 338 నెంబర్లతో మూడు జీవోలను జారీ చేసింది. వివిధ రకాల జీవోల వల్ల ప్రజల్లో ఆయోమయం చోటు చేసుకుంటోందన్న విమర్శలు ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని సమగ్రంగా ఒకే జీవోను జారీ చేసేందుకు నిర్ణయించారు. గాజువాక భూములను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన రేటునే రాష్ట్రం అంతటా వర్తింప చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ల్యాండ్ కన్వర్షన్ ఫీజు ఎక్కువగా ఉండటం వల్ల పారిశ్రామికీకరణ ఆశించిన స్థాయిలో లేదు. ప్రస్తుతం ఆ ఫీజు విశాఖ, విజయవాడల్లో 9 శాతం, ఇతర ప్రాంతాల్లో 5 శాతం ఉంది. తెలంగాణ ప్రభుత్వం దీనిని 9 నుంచి 3 శాతానికి, 5 నుంచి 2 శాతానికి తగ్గించింది. రాష్ట్రంలోనూ ఆదే విధంగా ఫీజును తగ్గించేందుకు నిర్ణయించారు. ఈ రెండు అంశాలకు సంబంధించి ముసాయిదాను తయారు చేసి మంత్రివర్గ ఆమోదానికి సిఫారసు చేసేందుకు నిర్ణయించారు.

చిత్రం..స్థలాల క్రమబద్ధీకరణపై సమావేశమైన మంత్రుల బృందం