రాష్ట్రీయం

నవ్వుతూ బతుకుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 14: ‘ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో బతికే తెలంగాణ కావాలన్నది నా ఆకాంక్ష. ఈ తెలంగాణలో ఉండే ప్రతి కులం, ప్రతి మనిషి చిరునవ్వుతో, గర్వంతో కాలర్ ఎగరేసేలా బతకాలి. ఉన్న వనరులు, వసతులు సద్వినియోగం కావాలి. దాన్ని నూటికి నూరుశాతం సాధించి తీరుతాం’ అని సిఎం కె చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. ‘ఆదాయ వృద్ధిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉంది. 23 జిల్లాల ఉమ్మడి ఆంధ్రకంటే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎక్కువ. ఉమ్మడి ఆంధ్రకు లక్ష 23 వేల కోట్ల బడ్జెట్ ఉండేది. కానీ ప్రస్తుత తెలంగాణ బడ్జెట్ లక్ష 49 వేల కోట్లు. మహారాష్ట్ర, గుజరాత్‌కంటే 21శాతం ఆదాయం పెరుగుదల ఉంది. దీన్నిబట్టే తెలంగాణ ప్రజలు ఎంత అదృష్టవంతులమో అర్థమవుతుంది’ అన్నారు. కులవృత్తులకు బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించడం పట్ల ఆయా వర్గాలకు చెందిన జనం మంగళవారం ప్రగతి భవన్‌కు తరలివచ్చి సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ చేపలను ఏవిధంగా పెంచుకోవచ్చో అసెంబ్లీలో చెబితే, ఆంధ్రకు చెందిన మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ ఫోన్ చేసి అభినందనలు తెలిపారన్నారు. చేపలంటే మేమే కదా? మా దగ్గర రేవులు, సముద్రం ఉందని ఆయన అడిగారరని, అయితే మా దగ్గర భగవంతుడిచ్చిన విద్య ఉంది. చెరువులున్నాయి. ఉమ్మడి సమైక్య రాష్ట్రంలో సరైన అవకాశం లభించక వెనుకబడి పోయాం’ అని చెప్పానన్నారు. రాష్ట్రంలో 400 టిఎంసి నీరు నిల్వవుండే ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. పది లక్షల మత్స్యకార కుటుంబాలను చేపల పెంపకం సొసైటీలో సభ్యులను చేయబోతున్నామన్నారు. ‘హైదరాబాద్‌లో రాంనగర్ చేపల మార్కెట్‌కు ప్రతి రోజు 22 నుంచి 30 లారీల చేపలు వస్తాయి. ఇక్కడ మత్స్యకారులు ఉండగా అక్కడి నుంచి ఇక్కడికి చేపలు ఎందుకు రావాలి. ఇది బంద్ కావాలి. హైదరాబాద్‌కు ప్రతి రోజు 600 లారీల గొర్రెలు వస్తున్నాయి. ఇక్కడ యాదవులు, కుర్వలు ఉండగా బయటి నుంచి ఇక్కడికి గొర్రెలు ఎందుకు రావాలి. ఇక్కడి నుంచి చేపలు, గొర్రెలు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలి’ అని ముఖ్యమంత్రి అన్నారు. కాళేశ్వరం నుంచి పాలమూర్ ప్రాజెక్టు అనుసంధానమైతే 45 వేల చెరువులతో పాటు నాగార్జునసాగర్, శ్రీశైలం, జూరాల, పులిచింతల వరకు 365 రోజులు నీళ్లుంటాయి. వీటిలో చేపల పెంపకం చేపడితే అద్భుతమైన పరిశ్రమ సృష్టించే అవకాశం ఉంటుందన్నారు. నారుూ బ్రాహ్మణులకు లక్ష రూపాయలతో సెలూన్లు పెట్టిస్తాం. 30 వేల సెలూన్లను ఉచితంగా మంజూరు చేస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రలో తెలంగాణలో వృత్తులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. అన్ని వర్గాలతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. రాజకీయాల్లో అందరికీ ప్రాతినిధ్యం ఉండాలి. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని వర్గాలకు భవిష్యత్‌లో ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. బోయలను వందశాతం ఎస్టీల్లో చేర్చి తీరుతామన్నారు. అత్యంత వెనుకబడిన తరగతులకు చెందిన వారి కోసం బడ్జెట్‌లో రూ.వెయ్యి కోట్లు కేటాయించాం. ఎంబిసిలో 70-80 కులాలున్నాయి. ఈ వర్గాలకు చెందిన వారినే కార్పొరేషన్‌కు చైర్మన్ చేస్తామన్నారు. తాను చెప్పేవన్నీ ఎన్నికలు, ఓట్ల కోసం కాదు. చేసే పనిలో చిత్తశుద్ధి ఉంటే ప్రజలే మమ్మల్ని గెలిపించుకుంటారని ముఖ్యమంత్రి అన్నారు.

చిత్రం.. ప్రగతి భవన్ వద్ద తనను కలిసిన కులవృత్తి సంఘాల నేతలతో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్