ఆంధ్రప్రదేశ్‌

అంతా అంకెల గారడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రబాబు గారడీతో రాష్ట్రం విస్మయం రుణమాఫీ అంటే ఇదేనా?
వృద్ధి రేటు ఓ జిమ్మిక్కే బడ్జెట్‌పై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్

విజయవాడ, మార్చి 15: రాష్ట్ర బడ్జెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు చూపించినదంతా అంకెల మాయేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఏపి బడ్జెట్‌లో చూపిస్తున్న లెక్కలు యావత్ ఆంధ్రరాష్ట్రం ఆశ్చర్యపోయేలా ఉన్నాయన్నారు. 2016-17కు సంబంధించి 11.61 శాతం వృద్ధిరేటు నమోదు కాబోతోందని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ‘ఐఎంఎఫ్ ఇటీవల విడుదల చేసిన లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సగటు జిడిపి వృద్ధిరేటు 3.1శాతం, దేశంలో 7.1శాతంగా ఉంది. దాని ప్రకారం దేశం బాగా వేగంగా అభివృద్ధి చెందితే మరి ఆంధ్రప్రదేశ్ ఏకంగా 11.61 శాతం నమోదు చేసిందంటే ఇప్పటికే మనం నెంబర్‌వన్‌గా ఉన్నట్లు కదా.. ఇక 2022, 29, 50 వరకు లక్ష్యాలు పెట్టుకోవడం ఎందుకు?’’ అని ప్రశ్నించారు. రాయితీలకు అవార్డులు తీసుకున్నట్లు చంద్రబాబు చెబుతుంటే శిథిలమైన భవనంలో చిన్న కిటికీ శుభ్రంగా ఉందని దానికి అవార్డు ఇచ్చినట్లు ఉందన్నారు. విజయవాడలో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జగన్ బడ్జెట్‌పై సుదీర్ఘంగా మాట్లాడారు. పట్టిసీమతో చంద్రబాబు ఏ రకంగా పంటలు కాపాడారో తెలియడం లేదన్నారు. 136.45 కోట్ల విద్యుత్ బిల్లుల కింద ఖర్చు చేసి, పట్టిసీమ నుంచి 42టిఎంసిల నీళ్ళు పంప్ చేశారని, ప్రకాశం బ్యారేజీ నుంచి 55 టిఎంసీల నీళ్ళు సముద్రంలో కలిపారని అన్నారు. పక్కనే ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 126కోట్లు ఇస్తే చాలు గ్రామాలను ఖాళీ చేయిస్తామని తెలంగాణా ప్రభుత్వం రెండేళ్ళ నుంచి అడుగుతోందని, అలా చేస్తే 48టిఎంసిల నీరు నిల్వ చేసుకోగలిగేవాళ్ళమని, అదే జరిగితే కృష్ణాజిల్లాలో రబీ ఎండిపోయేది కాదన్నారు. ఈ మూడేళ్లలో రైతుల రుణమాఫీకి ఇచ్చింది 10,600 కోట్లేనన్నారు. బాబు సీఎం అయ్యేనాటికి రైతుల వ్యవసాయ రుణాలు 87,612 కోట్లని, ఏడాదికి 3,500కోట్లు ఇచ్చి రుణమాఫీ ఇచ్చేశామని చెప్పి చెవిలో కాలీఫ్లవర్లు పెడుతున్నారన్నారు. చెల్లించవద్దని ఆయన చెప్పడం వల్ల రైతులు రుణాలపై 16వేల కోట్ల రూపాయలు అపరాధ వడ్డీ కడుతున్నారని, వడ్డీలో పావలా భాగం కూడా ఇవ్వని పరిస్థితి అన్నారు. బాబు సీఎం అయ్యాక డ్వాక్రా మహిళలకు 2015-16కు సంబంధించి వడ్డీని 577 కోట్లు ఇవ్వకపోగా, 2016-17 సంవత్సరానికి 996కోట్లు కూడా ఇవ్వలేదని, రెండూ కలిపితే ప్రభుత్వం ఇవ్వాల్సిన వడ్డీ బకాయిలే 1573కోట్లు ఉందన్నారు. 2015 సెప్టెంబర్ నుంచి ఇంతవరకు డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలకు సంబంధించి రూపాయి కూడా ఇవ్వలేదని, ఇచ్చిన 110కోట్లు పాత బకాయిలకే సరిపోయాయన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చంద్రబాబు సిగ్గుపడినట్లున్నారని ఎద్దేవా చేశారు. అందుకే దీనికి 1300 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. 108 సర్వీసులకు సంబంధించి 75కోట్లు అడిగితే 60కోట్లు కేటాయించి, 15 కోట్ల బకాయిలు అలాగే ఉంచారన్నారు. రెండేళ్లలో పది లక్షల ఇళ్ళు కడతామని చెబుతున్న చంద్రబాబు రాష్ట్రంలో నాలుగు లక్షల ఇళ్లకైనా లెక్కవేసుకుంటే లక్షన్నర చొప్పున ఆరువేల కోట్లు ఖర్చువుతుందని, కాని కేవలం 129కోట్లే కేటాయించడం దారుణమన్నారు. ఎస్సీ, ఎస్టీల మీద ప్రేమను చాటుకునే ప్రయత్నం చేశారని ఎద్దేవా చేశారు. సబ్‌ప్లాన్ ప్రకారం 2016-17లో 9457కోట్లుగా తేల్చారని, కాని ఖర్చుపెట్టింది ఏరోజూ 60శాతం దాటలేదన్నారు. నిరుద్యోగ భృతి కోసం కేవలం 500కోట్లు కేటాయింపు దారుణం అన్నారు.
చంద్రబాబు ఏం చెబితే పవన్ అదే..
కాగా.. పవన్ కళ్యాణ్ కూడా సమస్యలపై పోరాడుతున్నాడు కదా.. కలిసి పని చేస్తారా అని అడగ్గా స్పందించిన జగన్ బడ్జెట్‌పై మాట్లాడేటప్పుడు ఆయన ప్రస్తావన ఎందుకబ్బా అంటూనే.. ప్రస్తుతం ఇప్పుడు పవన్ చంద్రబాబు సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్ధితిలో ఉన్నాడన్నారు. చంద్రబాబు ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పవనే కాదు ఎవరూ ముందుకు వచ్చినా పోరాడేందుకు ఆప్యాయంగా స్వాగతిస్తామని జగన్ స్పష్టం చేశారు.

చిత్రం... బడ్జెట్ వివరాలతో మీడియాతో మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత జగన్