రాష్ట్రీయం

బాబూ..ఎందుకీ గొప్పలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 16: ‘పోలవరం ప్రాజెక్టు ఆయన చిరకాల స్వప్నం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. గతంలో అధికారంలో ఉన్న 9 ఏళ్ల కాలంలో ఇదే పెద్దమనిషి రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నార’ని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. దివంగత వైఎస్ హయాంలోనే కుడి, ఎడమ కాల్వలకు పనులు జరిగాయన్నారు. సుమారు ఐదువేల కోట్లతో పనులు నిర్వహిస్తే తమ ఘనతగా చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. గురువారం శాసనసభలో కేంద్రానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జగన్ ప్రసంగానికి అడుగడుగునా మంత్రులు ఆటంకాలు కల్పించటంతోపాటు మైక్ కట్ కావడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. విభజన చట్టంలోనే పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారని గుర్తుచేశారు. మధుకాన్ కంపెనీ బాబు బినామీ అయిన టిడిపి నేత నామా నాగేశ్వరరావుకు చెందిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మీదే కేంద్రం పోలవరం పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించిందని చెప్పారు. బ్యాంకులకు 450 కోట్ల బకాయిలు ఉన్న ట్రాన్స్‌ట్రాయ్ కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టి కొత్తగా టెండర్లు ఎందుకు పిలవరని ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడితో సహా సబ్ లీజులకు పనులు అప్పగిస్తూ కమీషన్లు బొక్కుతున్నారని ఆరోపించారు. నామినేషన్
పద్ధతిలో ముఖ్యమంత్రి ఇష్టారాజ్యంగా కాంట్రాక్టులు కేటాయిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాకు 14వ ఆర్థిక సంఘం నో అంటే 2015 మార్చి 2, 2016లో ప్రత్యేక హోదాను కాంక్షిస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి ఎలా పంపారని ప్రశ్నించారు. ఆర్థిక సంఘం సభ్యులుగా ఉన్న అభిజిత్‌సేన్, గోవిందరావు హోదా అంశంపై అధికారాలు లేవని స్పష్టంగా తేల్చి చెప్పారని గుర్తుచేశారు. ఏపి విభజన సమయంలోనే పోలవరంతోపాటు ప్రత్యేక హోదా ఇస్తామంటే 15 ఏళ్లు కావాలని అడిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు తగుదునమ్మా అంటూ కృతజ్ఞతలు చెప్పాలనటం దౌర్భాగ్యమని విమర్శించారు. రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసినప్పుడు హోదా రాదని తెలీదా అని ప్రశ్నించారు. ప్రజలను మోసగించే విధంగా తెలుగుదేశం పార్టీ తప్పుడు వాగ్దానాలు చేసిందన్నారు. విభజన చట్టంలోని హక్కులనే తాము ప్రశ్నిస్తున్నామని తెలిపారు.

చిత్రం..శాసనసభలో మాట్లాడుతున్న ప్రతిపక్ష నేత జగన్