రాష్ట్రీయం

కరెంటు కాటేస్తుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: విద్యుత్ రంగంలో ప్రస్తుతానికి కోతలు లేకున్నా, భవిష్యత్‌లో వాతలు పెట్టేలా సంక్షోభం ముంచుకు రానున్నదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం నాడు ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మిగులు విద్యుత్‌కు వచ్చినట్టు ప్రభుత్వం చెబుతోందని, రెండున్నరేళ్లలో ఇదంతా సాధించారా? లేక గత ప్రభుత్వాల పునాదులపై ఈ విజయం సాధించారా? ఆలోచించాలన్నారు. భద్రాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఇంతవరకూ మొదలు కాలేదని, వాస్తవానికి అది మార్చిలో పూర్తికావల్సిన ప్రాజెక్టని అన్నారు. యాదాద్రికి ఇంతవరకూ పర్యావరణ అనుమతులే రాలేదని, అనుమతులు వచ్చిన తర్వాత 44 నెలలు పడుతుందని, అంటే ప్రాజెక్టు అమలులోకి రావడానికి కనీసం మూడున్నరేళ్లు పడుతుందని, ఎన్‌టిపిసి 2017లో ఉత్పత్తి చేస్తుందని అన్నారని, అది కూడా చాలా ఆలస్యం అయ్యిందని చెప్పారు. చత్తీస్‌గఢ్‌తో చేసుకున్న విద్యుత్ ఒప్పందం వల్ల నష్టం వస్తుందేమో ఆలోచించాలన్నారు. ప్రస్తుతానికి యూనిట్ 4.95 రూపాయలుగా నిర్ణయించారని, దానిపై ఇఆర్‌సి ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఒక మెగావాట్‌కు 9 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో చత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం సాధ్యమేనా, అంత అవసరం ఉంటుందా అనే అంశాలను నిశితంగా పరిశీలించి
నిర్ణయం తీసుకోవాలని జానారెడ్డి విజ్ఞప్తి చేశారు. లేకుంటే కారిడార్ చార్జీలు, ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన చార్జీలు తడిసిమోపెడు అవుతాయని విద్యుత్ తెచ్చుకున్నా లేకున్నా కనీసం నెలకు 25 కోట్లు నష్టం వస్తుందని చెదప్పారు. విద్యుత్ తెచ్చుకోవాలన్నా నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తికావల్సి ఉంటుందని, ఈ మొత్తానికి సమగ్ర ప్రణాళిక లేకుంటే ప్రభుత్వం సంక్షోభంలో పడి దాని భారం ప్రజలపై వేసే ముప్పు ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పరిశ్రమల రంగం, విద్య, ఆరోగ్యం, సంక్షేమం తదితర రంగాలపై వివరంగా మాట్లాడారు.
ప్రభుత్వం ప్రవేశపేట్టిన బడ్జెట్‌లో వాస్తవాల కంటే అవాస్తవాలే ఎక్కువగా ఉన్నాయని జానారెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్ చాలా గందరగోళంగా ఉందని...ప్రజలను భ్రమింపచేసేలా ఉందని, ఆశల పల్లకిలో విహరింపచేసేలా బడ్జెట్‌లోని అంకెలు కనిపిస్తున్నాయని విమర్శించారు. దాదాపు రెండు గంటలకు పైగా మాట్లాడిన జానారెడ్డి సభలో అర్ధవంతమైన చర్చ జరిగేలా ప్రభుత్వం సహకరించాలని కోరారు. 1956 నుండి 1994 వరకూ అప్పుల కంటే ఆస్తులు ఎక్కువగా ఉండేవని, 1994 తర్వాత ఆస్తులు కంటే అప్పులు రెండింతలు పెరిగాయని అన్నారు. రాష్ట్రంలో 2014 నాటికి తలసరి ఆదాయం దేశ సగటు కంటే ఎక్కువగా ఉండేదని పరిశ్రమల్లో వృద్ధి రేటు పెరిగినా, వ్యవసాయం తగ్గుతూ వస్తోందని గణాంకాలతో సహా వివరించారు. 2013-14లో రాష్ట్రంలో 107 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు జరిగితే 2014-15లో 72 లక్షల టన్నులు, 2015-16లో 51 లక్షల టన్నులకు పడిపోయిందని అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

చిత్రం..అసెంబ్లీలో మాట్లాడుతున్న జానారెడ్డి