రాష్ట్రీయం

సుప్రీంకు వెళ్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16:సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడాన్ని సుప్రీంకోర్టులో అపీలు చేయాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సింగరేణి కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు. హైకోర్టు తీర్పుపై గురువారం సాయంత్రం ప్రగతి భవన్‌లో అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, సింగరేణి సిఎండి శ్రీ్ధర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, న్యాయ నిపుణులతో ముఖ్యమంత్రి సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. నిరంతరం గనుల్లో చెమటోడ్చే సింగరేణి కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ, అయితే కొందరు దురుద్దేశంతో కోర్టుకు వెళ్లారని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలపై పట్టు ఉన్న సీనియర్ న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాలన్నారు.