రాష్ట్రీయం

భద్రాద్రి థర్మల్‌కు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణుగూరు, మార్చి 16: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం మణుగూరు, పినపాక మండలాల సరిహద్దులో నిర్మించ తలపెట్టిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఏడాదిన్నర కాలంగా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న బిటిపిఎస్‌కు కేంద్ర పర్యావరణ శాఖ పచ్చజెండా ఊపింది. ఈ మేరకు బుధవారం కేంద్రంనుంచి ఉత్తర్వులు అందాయి. దీంతో ఇన్నాళ్లూ ఆగిపోయిన పనులు వారం రోజుల్లో మళ్లీ ప్రారంభం కానున్నాయి. 2015 మార్చి 28న సిఎం కెసిఆర్ భద్రాద్రి థర్మల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా ఒక గిరిజనుడి ఫిర్యాదుతో పనులు నిలిపి వేయాల్సిందిగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్లాంట్ అనుమతులపై ముఖ్యమంత్రి పలు దఫాలు కేంద్ర ప్రతినిధులతో చర్చించారు. ప్రత్యేక పరిస్థితులదృష్ట్యా పవర్ ప్లాంట్ కు అనుమతించాలని కోరడంతో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ కొరతను తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 1080 మెగావాట్ల సామర్థ్యంతో దీన్ని నిర్మించేందుకు రూ.7,200 కోట్లు కేటాయించింది. పనులు సాగుతున్న సమయంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ పనులు నిలిపి వేయాలని ఆదేశాలు జారీ చేయడంతో పవర్ ప్లాంట్ భవిష్యత్ అయోమయంలో పడింది. ఈ ప్రాజెక్టు ఆవశ్యకతను తెలంగాణ జెన్‌కో సిఎండి ప్రభాకర్‌రావుతో కూడిన బృందం పలుమార్లు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వివరణ ఇచ్చింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ఈ వ్యవహారాన్ని పరిష్కరించాల్సిందిగా పర్యావరణ కమిటీకి ట్రిబ్యునల్ సూచించింది. చైర్మన్ నవీన్‌చంద్రన్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు జనవరిలో ఢిల్లీలో సమావేశమైనప్పుడు సిఎండి ప్రభాకర్, ప్రాజెక్టు ఇంజనీర్ అజయ్‌లు పవర్‌ప్లాంట్ ఆవశ్యకతను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా కమిటీకి వివరించారు. దీనిపై చర్చించిన కమిటీ పర్యావరణ అనుమతులు మంజూరు చేయమని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు సూచించింది. దీంతో పర్యావరణ శాఖ భద్రాద్రి ప్లాంట్‌కు బుధ వారం అనుమతులు జారీ చేసింది. దీనిపై జెన్‌కో చీఫ్ ఇంజనీర్ అజయ్ మాట్లాడుతూ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ శాఖ అనుమతులు వచ్చాయని, వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని తెలిపారు.