రాష్ట్రీయం

ఐఐటిలకు అడ్వాన్స్ పరీక్షే కొలమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16:ఇంజనీరింగ్ విద్యలో భారీ ప్రక్షాళనకు కేంద్రం నడుం బిగించింది. అందులో భాగంగా వచ్చే ఏడాది (2018) నుండి జెఇఇ మెయిన్స్ పరీక్షను రద్దు చేయనుంది. ప్రస్తుతం జెఇఇ మెయిన్స్‌కు 13 లక్షల మంది హాజరవుతున్నారు. అఖిల భారత ఇంజనీరింగ్ కాలేజీల అడ్మిషన్ల పరీక్షగా దీని పేరును వచ్చే ఏడాది మార్చనున్నారు. ప్రస్తుతం జెఇఇ మెయిన్స్‌ను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల అడ్మిషన్లకు నిర్వహిస్తుండగా, అడ్వాన్స్ పరీక్షను ఐఐటిల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది నుండి అడ్వాన్స్ పరీక్షను యథాతథంగా కొనసాగిస్తారు. అయితే వారంతా ముందుగా నిర్వహించే ఇంజనీరింగ్ పరీక్షలో అర్హత సాధించాలనే నిబంధనను చేర్చనున్నారు. ఐఐటిల్లో ప్రవేశాలకు అడ్వాన్స్ పరీక్షనే కొలమానంగా తీసుకోనున్నారు. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు అఖిల భారత ఇంజనీరింగ్ కాలేజీల అడ్మిషన్ల పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను నేషనల్ టెస్టింగ్ సెంటర్ (ఎన్‌టిఎస్)కు అప్పగించనున్నారు. ప్రతి ఏటా ఈ పరీక్షను రెండుసార్లు 8 భాషల్లో నిర్వహించనున్నారు. దీనివల్ల మే నెలలోనే అడ్మిషన్లు పూర్తిచేసి ఇంజనీరింగ్ కాలేజీల్లో జూన్‌లోనే ప్రవేశాలను చేపట్టేందుకు వీలు కలుగుతుంది. తద్వారా ఏక రూపత సాధ్యపడుతుంది. తదుపరి తుది నిర్ణయం తీసుకునేవరకూ ఈ ఆలోచనలు అమలులోకి వస్తాయని మానవ వనరుల మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. అలాగే పాఠ్యప్రణాళికలో కూడా సంస్కరణలు తీసుకువస్తారు. ఇంజనీరింగ్‌లో చేరగానే నేరుగా రెగ్యులర్ పాఠ్యాంశాలపై క్లాసులు నిర్వహించే ముం దు, రెండు మూడు నెలల పాటు ఇండక్షన్ క్లాసులు నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 3300 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా వాటిలో 16 లక్షల వరకూ సీట్లు ఉన్నాయి. అయితే ప్రతి ఏటా 8 లక్షలకు మించి సీట్లు భర్తీ కావడం లేదు, దాంతో కాలేజీల నిర్వహణ పెద్ద ఇబ్బంది అవుతుండగా మరో పక్క అక్కడ చదువుకున్న వారికి ఉద్యోగాలు దక్కడం లేదు. నాణ్యతా ప్రమాణాలు లోపించాయని పరిశ్రమ చెబుతుండగా, కాలేజీల యాజమాన్యాలు మాత్రం తమకు తలకు మించిన భారం అవుతోందని పేర్కొంటున్నాయి. రానున్న రోజుల్లో కాలేజీల సంస్కరణలకు 250 కోట్లు వరకూ ఖర్చు చేయాలని ఎఐసిటిఇ తలపోస్తోంది. రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వాలని ఎఐసిటిఇ నిర్ణయించింది. ఎఐసిటిఇ నిబంధనలు పాటించలేమని రాష్ట్రాలు ఎదురుతిరిగితే ఆయా రాష్ట్రా ల్లో ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు ఇవ్వరాదనే ఆలోచనతో కూడా కేంద్రం ఉంది.