ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్ అనాథ కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 16: ఆంధ్రప్రదేశ్ అనాథ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేయడంపై ప్రధాని, కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలియచేసే తీర్మానాన్ని రాష్ట్ర శాసన మండలిలో ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రత్యేక హోదా కంటే మిన్నగా ప్యాకేజీ ఇచ్చారన్నారు. కష్టాలున్నా భయపడకుండా, కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ పనులు చేయించుకుంటున్నామన్నారు. కొంతమంది రెచ్చగొట్టినా, 33 వేల ఎకరాలను సమీకరించామన్నారు. బయట నుంచి చూస్తే పొలాల్లో ఉన్నట్టు ఉన్నా, లోపల మంచి సిటీలో ఉన్నట్లుగా అసెంబ్లీ భవనాన్ని నిర్మించుకున్నామన్నారు. క్లిష్ట సమయంలో రాష్ట్రాన్ని బయటపడేసే శక్తి తనకుందన్న నమ్మకం ప్రజలకుందన్నారు. తప్పటడుగు వేస్తే రాష్ట్రం అతలాకుతలం అవుతుందన్నారు. కేంద్రంతో గొడవ పెట్టుకుంటే ఏమి వస్తుందని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల పిల్లాడిని సాకినట్లుగా రాష్ట్రాన్ని సాకాలని, చాకచక్యంగా వ్యవహరించాలన్నారు. అవసరం అయితే గట్టిగా మాట్లాడాలన్నారు. విభజన జరిగిన వెంటనే ప్రజలంతా డల్‌గా మారారని, తుపాను తరువాత లాంటి వాతావరణం నెలకొందని, అలా భయపడితే ప్రమాదమని భావించి, కోపాన్ని కసిగా మార్చుకుని, విభజన చేసిన వారే అసూయ పడేలా అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చానని గుర్తు చేసుకున్నారు. కసితో పని చేసి, ప్రపంచానికి మంచి నగరాన్ని ఇవ్వాలని తన ఆలోచన అని అన్నారు. రాష్ట్భ్రావృద్ధికి కేంద్ర చేయూత కూడా అవసరమన్నారు. మోహమాటం లేకుండా మాట్లాడుతానన్న అపవాదు తనపై ఉందని, కేంద్రం ఎంత ఇచ్చినా తృప్తి పడనని తెలిపారు. 2019 నాటికి పోలవరం పూర్తి చేయాలన్న ఉక్కు సంకల్పంతో పని చేస్తున్నానని తెలిపారు. కేంద్ర సాయానికి కృతజ్ఞతలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో కొంతమంది పండగపూట పశువుల్లా ఎగురుతున్నారని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ అడిగిన ప్రశ్నలపై సిఎం వివరణ ఇస్తూ పోలవరం ప్రాజెక్టులో భాగంగా 4000 కోట్ల రూపాయలతో నిర్మించే విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వమే నిధులు భరిస్తుందన్నారు. ప్రాజెక్టు నిర్మించాలంటే భూసేకరణ, పునరావాసం తప్పదని, అందుకు అయ్యే ఖర్చును కేంద్రమే భరిస్తుందని తాను భావిస్తున్నానని తెలిపారు. కేంద్ర మంత్రివర్గ నిర్ణయం అమలు చేయాల్సి ఉంటుందని, వెనక్కి వెళ్లే అవకాశం ఉండదన్నారు.
ఎమ్మెల్సీలు బొడ్డు నాగేశ్వరావు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీని రాయలసీమకు అడగాలని కోరారు. నిధుల సమీకరణకు బాండ్ల జారీలో సభ్యుల సేవలు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్సీ సూర్యారావు తెలిపారు. తీర్మాన విషయంలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు సంతృప్తి చెందేలా సమాధానాలు ఇచ్చానని, తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని సిఎం కోరారు. అనంతరం తీర్మానాన్ని ఏకగ్రీవంగా సభ ఆమోదించిందని చైర్మన్ చక్రపాణి ప్రకటించారు.