రాష్ట్రీయం

నిధులు రాబట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 17: నిరంతర సంప్రదింపులతో కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. ముగిసే ఆర్థిక సంవత్సరానికి వివిధ శాఖలకు కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఎంతెంత జరిగాయో కచ్చితమైన వివరాలు తెలుసుకోవాలన్నారు. రావలసిన నిధుల కోసం నెలాఖరులోగా అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. శుక్రవారం సాయంత్రం అన్ని శాఖలకు చెందిన కార్యదర్శులు, శాఖాధిపతులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఏయే శాఖలకు ఎనె్నన్ని నిధులు వచ్చాయనే విషయంపై ఆరా తీశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను వివరించి ఒప్పించి న్యాయంగా మనకు రావాల్సిన నిధులు రాబట్టాలన్నారు. కేవలం శాఖలవారీ బడ్జెట్ కేటాయింపులే కాకుండా కొన్ని శాఖల్లో ప్రత్యేకమైన నిధులు ఉంటాయని వివరించారు. ఆ శాఖలకు సంబంధించిన పనులను చేపట్టి నిధులు రాబట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరికొద్దిరోజులే వ్యవధి ఉన్నందున కేంద్రం నుంచి రావాల్సిన నిధులను మంజూరు చేయించుకోవడానికి అవసరమైతే ఢిల్లీ వెళ్లి సంబంధిత ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి హితవు చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్రం సమకూర్చే నిధులపై ముందునుంచే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. ఎప్పటికప్పుడు పనులను పూర్తిచేసి నిధులను డ్రా చేయాలని సూచించారు. పంచాయతీరాజ్ శాఖలో ముఖ్యమైన ఏడు కార్యక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నరేగాకు సంబంధించి రూ.3వేల కోట్ల మేర తొలి త్రైమాసికం నిధులు విడుదల అవుతున్నందున ఇప్పటినుంచే తగిన కసరత్తు మొదలుపెట్టాలని చెప్పారు. స్వచ్ఛ భారత్ పనులకు అదనపు నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని అడిగామన్నారు. ఒకవైపుఅదనపు నిధుల కోసం తాను ప్రయత్నిస్తుంటే మరోవైపు కొన్ని శాఖల్లో ఉన్న నిధులే ఖర్చుచేయని పరిస్థితి కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మిషన్ మోడ్‌లో పనిచేయకపోతే ఆశించిన అభివృద్ధిని అందుకోలేమన్నారు. కరవు సహాయంపై కేంద్ర మంత్రికి మరోమారు లేఖ రాయాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం, అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యమంత్రి పేషీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.